logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయం పరిశీలన అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం పార్టీ జిల్లా అగ్రనేతలు సందర్శించారు.పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య,మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, సమన్వయకర్తలు విశ్వేశ్వరరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, PAC సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్ ఇతర ముఖ్యనేతలు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు సాగించిన విధ్వంసాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మెటీరియల్‌ను దొంగిలించినట్లు నేతలు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వారు వెల్లడించారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

9 hrs ago
user_M vinod kumar
M vinod kumar
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
3a7ce35b-f8b4-4d4d-be7d-cbf4492450ea

అనంతపురంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయం పరిశీలన అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం పార్టీ జిల్లా అగ్రనేతలు సందర్శించారు.పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య,మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, సమన్వయకర్తలు విశ్వేశ్వరరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, PAC సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్ ఇతర ముఖ్యనేతలు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు సాగించిన విధ్వంసాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మెటీరియల్‌ను దొంగిలించినట్లు నేతలు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వారు వెల్లడించారు. రాజకీయ కక్షలతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
    1
    ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    3
    శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు 
జిల్లా కోర్టు ఆదేశాల మేరకు  మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు  తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Saddala Adi Narayana Reporter
    Saddala Adi Narayana Reporter
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    1
    శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
    user_Santhosha Yadv
    Santhosha Yadv
    జర్నలిస్ట్ Madakasira, Sri Sathya Sai•
    6 hrs ago
  • ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.
    1
    ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కడప అల్లాహ్ 23 24 25
    1
    కడప అల్లాహ్ 23 24 25
    user_Shaik nazeerbasha
    Shaik nazeerbasha
    Photographer ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
    5
    పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు  
కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల
నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి  అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం 
చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు  వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో  ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో  అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం  ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్    భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం   మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు  పాల్గొనడం జరిగింది.
    user_Sateesh bhupanupadu
    Sateesh bhupanupadu
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరులలో 50 పడకల ఆస్పత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా మంత్రి రిప్లై ఇచ్చారు. 'కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆస్పత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ కింద 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం' అని తెలిపారు
    1
    తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరులలో 50 పడకల ఆస్పత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా మంత్రి రిప్లై ఇచ్చారు. 'కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆస్పత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ కింద 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం' అని తెలిపారు
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.