రేషన్ బియ్యం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లోనే ఇవ్వాలి. ఐటీడీఏ పి వో కు విన్నవించిన ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఏప్రిల్ 21:-పోలవరం ప్రాజెక్టు లో ముంపుకు గురయ్యే నిర్వాసిత ప్రజలు వారికి నిర్మించిన పునరావాస కాలనీలలో కొన్ని కుటుంబాలు తరలివెళ్లి నివసిస్తున్నాయని, వారికి ఆ కాలనీలలోనే ఈకేవైసీ చేయించి రేషన్ బియ్యం ఇప్పించాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు మంగళవారం నాడు చింతూరు ఐటిడిఏ "ఐటీడీఏ పిఓ" ను కలిసి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ఆర్ పురం మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీలోని కల్తునూరు గ్రామ నిర్వాసితులకు ఎటపాక మండలం కన్నాయిగూడెం లో పునరావాస కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నదని వరదల్లో ఇబ్బందులు పడలేక సుమారు 50 కుటుంబాల నిర్వాసితులు కన్నాయిగూడెం పునరావాస కాలనీకి వెళ్లి సంవత్సరం నుంచి నివసిస్తున్నారని వారు తెలిపారు. వారు రేషన్ బియ్యం తీసుకోవాలంటే నెలలో ఒకసారి ఈ కేవైసీ కోసం మరోసారి రేషన్ బియ్యం కోసం వచ్చి వెళ్ళడానికి సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉన్నదని, వారు బియ్యం తీసుకోవడానికి ఒక్కొక్కరు 300 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని పిఓ కు తెలిపారు. ఈ సమస్య లేకుండా పునరావాస కాలనీలలోనే ఈ కేవైసీ చేయించి రేషన్ బియ్యం ఇప్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు "ఐటీడీఏ పి.ఓ" ను కోరారు. స్పందించిన "పి.ఓ" తక్షణమే ప్రత్యేక అధికారులను పునరావాస కాలనీలో నియమించి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. కలిసిన వారిలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సీసం సురేష్ నాయకులు సుబ్బారావు తదితరులు ఉన్నారు.

- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- Post by Ramprasad islavath1
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- Post by Sageni gangadhar1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పట్టణం మొత్తం జలమయంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, రోడ్లపై వరదలా ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రాకపోకలు చేయడం కష్టంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ కాలువలు నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by V Ramarao1