Shuru
Apke Nagar Ki App…
బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
Shareef pasha
బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
More news from తెలంగాణ and nearby areas
- పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు.. నల్లబెల్లిలో జనసంద్రం వరంగల్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతున్నారు.2
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- ఉద్యమ గాయాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్:నర్సంపేట పట్టణంలో 2023లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడటంతో కుడి కన్ను చూపు కోల్పోయానని, లాఠీచార్జీల్లో చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం శరీర నొప్పులతో బాధపడుతూ వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే నడవగలుగుతున్నానని పేర్కొంటూ, తనను అపార్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు.1
- పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు... తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.2