ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, పిఠాపురం పట్టణంలో జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, ప్రతిరోజూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, ముగింపు కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడా పీడీ మరియు పిఠాపురం మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎన్. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వి.ఎస్.టి.వి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎన్. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, యోగా ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాలని, ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి సక్రమంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు సమాజ అభివృద్ధికి మరింతగా తోడ్పడగలరని పేర్కొంటూ, ముఖ్యంగా ఉద్యోగులు, మహిళలు, యువత, బాలికలు యోగా పట్ల ఆసక్తి పెంచుకొని క్రమం తప్పకుండా అభ్యసించాలని సూచించారు. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని వివరించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎస్.వి.ఎస్.టి.వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడే ఉత్తమ సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకురాలు డాక్టర్ వి సత్యప్రియా, పట్టణ జనసేన అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, మున్సిపల్ డి.ఈ. పి. రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, యువత, పట్టణ ప్రజలు సహా పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, పిఠాపురం పట్టణంలో జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా, ప్రతిరోజూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, ముగింపు కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడా పీడీ మరియు పిఠాపురం మున్సిపల్ ప్రత్యేక అధికారి ఎన్. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వి.ఎస్.టి.వి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎన్. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, యోగా ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాలని, ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి సక్రమంగా మారుతుందని ఆయన
స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు సమాజ అభివృద్ధికి మరింతగా తోడ్పడగలరని పేర్కొంటూ, ముఖ్యంగా ఉద్యోగులు, మహిళలు, యువత, బాలికలు యోగా పట్ల ఆసక్తి పెంచుకొని క్రమం తప్పకుండా అభ్యసించాలని సూచించారు. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని వివరించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎస్.వి.ఎస్.టి.వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడే ఉత్తమ సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకురాలు డాక్టర్ వి సత్యప్రియా, పట్టణ జనసేన అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, మున్సిపల్ డి.ఈ. పి. రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి. ప్రభాకర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, యువత, పట్టణ ప్రజలు సహా పలువురు పాల్గొన్నారు.
- రాజమహేంద్రవరంలో జూన్ 21న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెదపూడి మండల మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ సర్ధార్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గౌరవ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సంక్షేమ కార్యక్రమాల అమలు, అరుదైన వ్యాధులపై అవగాహన విస్తరణ, ప్రత్యేక వైద్య సేవలపై చర్చించి వినతిపత్రం సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువతలో కనిపిస్తున్న SMA (Spinal Muscular Atrophy) మరియు DMD (Duchenne Muscular Dystrophy) వంటి అరుదైన కండరాల సంబంధిత వ్యాధుల బాధితుల పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు షేక్ సర్ధార్ హుస్సేన్ తెలిపారు. ఈ వ్యాధుల చికిత్సకు అధిక వ్యయం, నిరంతర వైద్య పర్యవేక్షణ ఆవశ్యకత, అలాగే బాధితుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు. భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఈ తరహా బాధితులకు మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక విధానాలు రూపొందించి, బాధితులకు త్వరితగతిన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధులపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల గుర్తింపు, చికిత్స ఆలస్యం అవుతున్న పరిస్థితిని కూడా సమావేశంలో ప్రస్తావించారు. దీనికి పరిష్కారంగా జిల్లా స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం, బాధితుల నమోదు ప్రక్రియను సులభతరం చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అవసరమైన వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్లు షేక్ సర్ధార్ హుస్సేన్ పేర్కొన్నారు.1
- రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన యోగా సాధకులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామూహికంగా యోగాసనాలు వేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని ఎంపీ పురంధరేశ్వరి అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, యోగా సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, ప్రతిరోజూ 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగా ద్వారా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వగురువుగా గుర్తించాయని పేర్కొంటూ, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం "Yoga for Healthy Ageing" అనే అంశంతో నిర్వహించబడిందని చెప్పారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత పెంపొందించడంలో యోగాభ్యాసం కీలకమని తెలిపారు. యోగా జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని చెబుతూ, యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.1
- 😭🙏1
- తేదీ 21 జూన్ 2026న, భారతీయ జనతా పార్టీ (BJP) పెదపూడి మండలం మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ సర్ధార్ హుస్సేన్, రాజమహేంద్రవరంలోని ఆర్ & బి బంగ్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, SME (Spinal Muscular Atrophy) మరియు DMD (Duchenne Muscular Dystrophy) వంటి ప్రాణాంతక మరియు ప్రమాదకర వ్యాధులపై భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, అలాగే భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలపై గౌరవ మంత్రివర్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అంతేకాకుండా, ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పరంగా మరింత సహాయ సహకారాలు అందించే అంశాలపై కూడా కూలంకషంగా చర్చించినట్లు భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా వెల్లడైంది.1
- ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా అనపర్తిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. పతాంజలి మహర్షి యోగాను అష్టాంగ యోగాలుగా తీర్చిదిద్దారని ఆయన గుర్తుచేశారు.1
- Post by Narasimha Narasimha4
- ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా రూ.5.6 కోట్ల విలువైన 1125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరకు నియోజకవర్గంలోని ముంచంగిపట్టు మండలం బూసిపుట్టు వద్ద ముందస్తు సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ మరియు ముంచంగిపట్టు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ జాయింట్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.1
- 😭🙏1