Shuru
Apke Nagar Ki App…
ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
Suresh Sagar
ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రతినిధులు మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
More news from తెలంగాణ and nearby areas
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV2
- Post by Ali ammu1
- హైదరాబాద్:హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదర్గుల్ కి చెందిన కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెపోతుల వర్ధన్(19)నాదర్గోల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు నాదర్గుల్ నుండి బడంగ్పేట్ వైపు వెళ్లే AP04TT4717 నంబర్ గల టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒకసారిగా రోడ్డుమీదికి రావడంతో ఆటో తగిలి బైక్(AP35AD8497)అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరాలు నమోదయ్యాయి సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.1
- మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్ దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad2
- The residents of Darushafa are facing a lot of trouble due to stray dogs. We request @GHMCOnline to please remove them fr1
- కేశంపేట మండలం పరిధిలోని కాకునూరు గ్రామం లో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కాకునూరు సుందరాపురం ప్రభ ఎదుర్కోళ్ళు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో హారతులు, భజనలు, సాంప్రదాయ వాద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం, ప్రసాద పంపిణీ నిర్వహించి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.1