కరీంనగర్ లో ఈనెల 12న హిందూ ఏక్తా యాత్ర.... భారీగా ఏర్పాట్లు చేస్తున్న బిజెపి శ్రేణులు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ గుప్పెడు మందితో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానియాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు వివిధ వ్రుత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి.
కరీంనగర్ లో ఈనెల 12న హిందూ ఏక్తా యాత్ర.... భారీగా ఏర్పాట్లు చేస్తున్న బిజెపి శ్రేణులు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ గుప్పెడు మందితో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ
ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం
4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానియాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా
భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు వివిధ వ్రుత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి.
- తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పది రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు జూల వంశీ మృతదేహం ఎక్లాస్ పూర్ వద్ద లభ్యమైంది. దీనిని హత్యగా అనుమానిస్తూ పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- కరీంనగర్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.2
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- వరంగల్ నగరంలోని ఏకశిలా పరపతి సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం సభ్యులు ఆందోళన చేపట్టారు. సంఘం ఆదాయం, ఖర్చులు, సభ్యుల చందాల వివరాలు పారదర్శకంగా వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సభ్యులు హెచ్చరించారు.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో పోలీసుల ఆలస్యం, శాంతిభద్రతలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె తప్పుబట్టారు.1
- తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆర్జిత సేవలు రద్దు చేసి నిరంతరాయంగా దర్శనం కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.2