పాఠశాల భవనంలో నిర్మాణాలు చేపట్టొద్దు గ్రామస్తుల సమక్షంలో హెచ్చరించిన మండల విద్యాధికారి మహమ్మదాబాద్: మండలంలోని బోట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల భవనం ఆక్రమణ, కూల్చివేతకు సంబంధించిన అంశంపై మండల విద్యాధికారి రాజు నాయక్ స్పందించారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పాఠశాల భవనాన్ని స్థానిక నంచర్ల కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ సురేందర్‌రెడ్డి పరిశీలించి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మండల విద్యాధికారి తెలిపారు.ఇప్పటికే పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఉన్న నిర్మాణాలను తొలగించరాదని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు సంబంధితులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మండల విద్యాధికారి గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని, భవనానికి ఎలాంటి నష్టం కలిగించవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో పాఠశాల భవనం నిర్మాణం కోసం తమ పట్టాభూమిని ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో పాఠశాల భవనంలో తలదాచుకున్నామని చెప్పారు. ఇకపై పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని గ్రామ సర్పంచ్ సమక్షంలో హామీ ఇచ్చారు.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలను మిగిలిన రెండు తరగతి గదుల భవనాల్లో కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారికి వివరించారు.అనంతరం మండల విద్యాధికారి గ్రామస్తులతో మాట్లాడి, పాఠశాల విద్యకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆముదాలగడ్డ తండా, నంచర్ల ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
పాఠశాల భవనంలో నిర్మాణాలు చేపట్టొద్దు గ్రామస్తుల సమక్షంలో హెచ్చరించిన మండల విద్యాధికారి మహమ్మదాబాద్: మండలంలోని బోట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల భవనం ఆక్రమణ, కూల్చివేతకు సంబంధించిన అంశంపై మండల విద్యాధికారి రాజు నాయక్ స్పందించారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పాఠశాల భవనాన్ని స్థానిక నంచర్ల కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ సురేందర్‌రెడ్డి పరిశీలించి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మండల విద్యాధికారి తెలిపారు.ఇప్పటికే పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఉన్న నిర్మాణాలను తొలగించరాదని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు సంబంధితులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మండల విద్యాధికారి గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని, భవనానికి ఎలాంటి నష్టం కలిగించవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో
పాఠశాల భవనం నిర్మాణం కోసం తమ పట్టాభూమిని ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో పాఠశాల భవనంలో తలదాచుకున్నామని చెప్పారు. ఇకపై పాఠశాల భవనంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోమని గ్రామ సర్పంచ్ సమక్షంలో హామీ ఇచ్చారు.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలను మిగిలిన రెండు తరగతి గదుల భవనాల్లో కొనసాగిస్తున్నట్లు మండల విద్యాధికారికి వివరించారు.అనంతరం మండల విద్యాధికారి గ్రామస్తులతో మాట్లాడి, పాఠశాల విద్యకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆముదాలగడ్డ తండా, నంచర్ల ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
- బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు4
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1