*కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలోమెట్‌పల్లి కోరుట్ల డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు,హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక టీహబ్ & టీ–వర్క్స్ ను సందర్శి* కోరుట్ల మెట్ పల్లి డిసెంబర్ 18 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి కోరుట్ల డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక టీహబ్ & టీ–వర్క్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు. విద్యే నిజమైన సంపద అని, డిగ్రీ పూర్తిచేయడమే లక్ష్యం కాకుండా, నైపుణ్యాలు పెంచుకొని అవకాశాలను సృష్టించుకోవాలి అని సూచించారు. టీ-హబ్ టీ-వర్క్స్ కల్పిస్తున్న స్టార్టప్, స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. టీ–హబ్ & టీ–వర్క్స్ లో స్టార్టప్‌లు ఎలా ప్రారంభమవుతున్నాయో, కొత్త ఆలోచనలు పరిశ్రమలుగా ఎలా మారుతున్నాయో, యువతకు అక్కడ లభిస్తున్న శిక్షణ, సాంకేతిక మద్దతు ఎలా ఉంటుందో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్శన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, కొత్త ఆలోచనలకు ప్రేరణనిచ్చిందని.భవిష్యత్తులో ఉద్యోగం కోరుకునే స్థితి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆశయాన్ని నింపిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలనే సంకల్పంతో ఇలాంటి విద్యా–ప్రయోజనకర కార్యక్రమాలను చేపడుతున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి విద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
*కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలోమెట్‌పల్లి కోరుట్ల డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు,హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక టీహబ్ & టీ–వర్క్స్ ను సందర్శి* కోరుట్ల మెట్ పల్లి డిసెంబర్ 18 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో
మెట్‌పల్లి కోరుట్ల డిగ్రీ కళాశాలకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక టీహబ్ & టీ–వర్క్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు. విద్యే నిజమైన సంపద అని, డిగ్రీ పూర్తిచేయడమే లక్ష్యం కాకుండా, నైపుణ్యాలు పెంచుకొని అవకాశాలను సృష్టించుకోవాలి అని సూచించారు. టీ-హబ్ టీ-వర్క్స్ కల్పిస్తున్న స్టార్టప్,
స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. టీ–హబ్ & టీ–వర్క్స్ లో స్టార్టప్‌లు ఎలా ప్రారంభమవుతున్నాయో, కొత్త ఆలోచనలు పరిశ్రమలుగా ఎలా మారుతున్నాయో, యువతకు అక్కడ లభిస్తున్న శిక్షణ, సాంకేతిక మద్దతు ఎలా ఉంటుందో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్శన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, కొత్త ఆలోచనలకు ప్రేరణనిచ్చిందని.భవిష్యత్తులో ఉద్యోగం కోరుకునే స్థితి
నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆశయాన్ని నింపిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలనే సంకల్పంతో ఇలాంటి విద్యా–ప్రయోజనకర కార్యక్రమాలను చేపడుతున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి విద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.