కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో అధిక సంఖ్యలో నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాలను మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్ పి వి. హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందాలు కూడా విధుల్లో భాగంగా పాల్గొన్నాయి.తీర ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా మరియు సురక్షితంగా జరిగేలా చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాల నిమజ్జనాల్లో ఎలాంటి అపశ్రుతులు లేదా అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు సంభవించకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు జరగేలా చూడాలని, ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించాలని, భక్తులు ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా, చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు, నిమజ్జనానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తూ ఉండాలన్నారు.నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లు, హెచ్చరిక బోర్డులు, కట్‌ఆఫ్ బోట్లు, లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు వంటి అవసరమైన భద్రతా సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గజఈతగాళ్లకు ప్రత్యేక టీ-షర్టులు అందజేయడం ద్వారా వారు సులభంగా గుర్తించబడేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా మెరైన్ పోలీసులు కూడా విధుల్లో పాల్గొని సేవలు అందించనున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని భద్రతా, బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు, మెరైన్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. నిమజ్జనం జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో అదనపు ఎస్పీలను ప్రత్యేకంగా నియమించినట్లు వివరించారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ, పోలీసుల సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలని కోరారు.వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాలువలు, చెరువులు, నదులు తదితర నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ స్టేషన్ అధికారులు కట్టుదిట్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గణేష్ నిమజ్జన ప్రదేశాల్లో ఈత రాని వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లోతైన నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజలు నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో అధిక సంఖ్యలో నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాలను మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్ పి వి. హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందాలు కూడా విధుల్లో భాగంగా పాల్గొన్నాయి.తీర ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా మరియు సురక్షితంగా జరిగేలా చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాల నిమజ్జనాల్లో ఎలాంటి అపశ్రుతులు లేదా అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు సంభవించకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు జరగేలా చూడాలని, ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించాలని, భక్తులు ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా, చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు, నిమజ్జనానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తూ ఉండాలన్నారు.నిమజ్జన ప్రాంతాల్లో
గజఈతగాళ్లు, హెచ్చరిక బోర్డులు, కట్‌ఆఫ్ బోట్లు, లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు వంటి అవసరమైన భద్రతా సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గజఈతగాళ్లకు ప్రత్యేక టీ-షర్టులు అందజేయడం ద్వారా వారు సులభంగా గుర్తించబడేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా మెరైన్ పోలీసులు కూడా విధుల్లో పాల్గొని సేవలు అందించనున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని భద్రతా, బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు, మెరైన్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. నిమజ్జనం జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో అదనపు ఎస్పీలను ప్రత్యేకంగా నియమించినట్లు వివరించారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ, పోలీసుల సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలని కోరారు.వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాలువలు, చెరువులు, నదులు తదితర నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ స్టేషన్ అధికారులు కట్టుదిట్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గణేష్ నిమజ్జన ప్రదేశాల్లో ఈత రాని వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లోతైన నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజలు నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
- నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం! దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై.. కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు మీ బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,1
- మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి కాన్పు కోసం మాచవరం ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన కొమ్ము మహిమ అనే బాలింత అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో బాలింతకి కాన్పు చేసిన ఆసుపత్రి ఆయా వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం శిశువు మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు2
- మచిలీపట్నం మంగినపూడిలో ఘనంగా సాగర తీర విజయ గణపతి ఉత్సవాలు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహిస్తున్న సాగర తీర విజయ గణపతి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి స్వామివారిని ఆవాహన చేసుకున్నారు. గణపతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మంగినపూడి సముద్ర తీరంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బీచ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుధ్యం, భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ గణపతిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- దేవదేవునికి సతీసమేతంగా 15 సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పొందటం నువ్వు చేసుకున్న పుణ్యం🙏🙏అలాంటి నీకు ప్రాణమిచ్చే సైనికులుగా మమ్మల్ని పుట్టించిన ఆ శ్రీవారికి ఏమి చేయగలం,ఇవ్వగలం,భక్తితో సాష్టాంగ ప్రణామం చేయటం తప్ప🙏🙏....1
- *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన* *ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన* ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. "వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.1
- లోకేష్ పర్యటన నీ విజయవంతం చేయాలి.. పెడన ఎమ్మెల్యే కాగిత పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల TDP నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.1
- పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.1
- కోదాడలోని సెయింట్ జోసెఫ్ సి.సి. రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో మెగా జాబ్ మేళా కోదాడలోని సెయింట్ జోసెఫ్ సి.సి. రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.1