Shuru
Apke Nagar Ki App…
నిర్మల్ లో వేడి తాకిడి – పెట్రోల్ బంక్‌లలో సేఫ్టీ చర్యలు నిర్మల్ జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌ల యజమానులు అప్రమత్తమయ్యారు. అధిక వేడి వల్ల యంత్రాలు దెబ్బతినే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని బంక్‌ల వద్ద కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేడి కారణంగా మిషన్లు పనిచేయకపోవడం లేదా ప్రమాదాలు జరిగే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టడం ప్రాధాన్యంగా మారింది.
Ravula Purushotham
నిర్మల్ లో వేడి తాకిడి – పెట్రోల్ బంక్‌లలో సేఫ్టీ చర్యలు నిర్మల్ జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌ల యజమానులు అప్రమత్తమయ్యారు. అధిక వేడి వల్ల యంత్రాలు దెబ్బతినే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని బంక్‌ల వద్ద కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేడి కారణంగా మిషన్లు పనిచేయకపోవడం లేదా ప్రమాదాలు జరిగే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టడం ప్రాధాన్యంగా మారింది.
More news from తెలంగాణ and nearby areas
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. ఆ వార్డులోని ఎంపీడీవో, తాసిల్దార్, రిజిస్ట్రేషన్ వెళ్లే రహదారి పక్కన 5 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి ప్రవాహం ఉండడంతో చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని కోరారు.1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంజిల్లాలోని ఇందిరానగర్ సమీపంలో కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో వాహనం మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నాలుగు మేకలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనం వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‌లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌కు రావాలన్నారు. ఈ స్కామ్‌లో మంగ్లీ, ఆమె సోదరుడికి ప్రమేయం ఉన్న ఆధారాలు తాను బయటపెట్టానని, కావాలంటే మరోసారి చూపిస్తానని సుబ్బారావు తెలిపారు. మంగ్లీ తనను 10 లక్షలు డిమాండ్ చేసిందని, తాను సైలెంట్ అయితే రూ.10 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- పత్రిక ప్రకటన తేది: 16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, జరుగుతున్న పనుల నాణ్యతను అంచనా వేసి, ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందించారు. అలాగే అక్కడ నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించి, విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. ఈ ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. జిల్లాలో యువతకు క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని రకాల క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్‌డీవో ఎన్.వై. గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, కాంట్రాక్టర్ ఏజెన్సీ సభ్యుడు వెంకటరమణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.1
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1