కన్నాల రైతు వేదికలో సహజ వ్యవసాయంపైన రైతులకు అవగాహన కార్యక్రమం జాతీయ సహజ వ్యవసాయం లో భాగంగా కన్నాల రైతు వేదికలో రైతు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం రైతులు, తాండూర్ మండలం గోపాల్ నగర్ రైతులు పాల్గొన్నారు.ఆర్థిక సంవత్సరం 2026 -2027 సంవత్సరo నకు సంబంధించి ఎంపిక కాబడిన సేంద్రియ రైతులకు కన్నాల రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ వారు సహజ వ్యవసాయం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించి సేంద్రియ సాగులో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలు నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల యాజమాన్యం, సహజ వనరుల వినియోగం పై సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజా నరేందర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగు మరియు సహజ వ్యవసాయం చేయడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తక్కువ పెట్టుబడి పెడుతూ సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి వివిధ వనరును వాడుకుంటూ రసాయనిక ఎరువులను,రసాయనిక పురుగుమందులను వాడకుండా ఉంటూ వ్యవసాయం చేసి సుస్థిర లాభాన్ని గణనీయంగా పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం చక్కటి పథకాన్ని తీసుకు వచ్చయని,గత సీజన్ నుండి బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో ప్రతి శుక్రవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నామని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహజ వ్యవసాయం గానీ సేంద్రీయ వ్యవసాయం గాని చేసి భావితరాలకు ఆరోగ్యం కరమైన పంటనే కాకుండా ఆరోగ్యకరమైన నేలను అందించాలని కోరారు అనంతరం తాండూరు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సుష్మ మాట్లాడుతూ సహజ వ్యవసాయంలో ఘనజీవామృతం, అగ్ని అస్త్రం మరియు వివిధ కషాయాలు తయారు చేసుకునే విధానాలను వివరించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి సిహెచ్ తిరుపతి గురజాల వ్యవసాయ విస్తరణ అధికారి గౌస్య బేగం ఇష్టం పేట వ్యవసాయ విస్తరణ అధికారి కె రాకేష్ అంకుశం సర్పంచ్ మరియు ఉద్యానవన అధికారిని అర్చన, రైతులు పాల్గొన్నారు.
కన్నాల రైతు వేదికలో సహజ వ్యవసాయంపైన రైతులకు అవగాహన కార్యక్రమం జాతీయ సహజ వ్యవసాయం లో భాగంగా కన్నాల రైతు వేదికలో రైతు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం రైతులు, తాండూర్ మండలం గోపాల్ నగర్ రైతులు పాల్గొన్నారు.ఆర్థిక సంవత్సరం 2026 -2027 సంవత్సరo నకు సంబంధించి ఎంపిక కాబడిన సేంద్రియ రైతులకు కన్నాల రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ వారు సహజ వ్యవసాయం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించి సేంద్రియ సాగులో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలు నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువుల యాజమాన్యం, సహజ వనరుల వినియోగం పై సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
విచ్చేసిన బెల్లంపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజా నరేందర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగు మరియు సహజ వ్యవసాయం చేయడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తక్కువ పెట్టుబడి పెడుతూ సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి వివిధ వనరును వాడుకుంటూ రసాయనిక ఎరువులను,రసాయనిక పురుగుమందులను వాడకుండా ఉంటూ వ్యవసాయం చేసి సుస్థిర లాభాన్ని గణనీయంగా పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల శ్రేయస్సు కోసం చక్కటి పథకాన్ని తీసుకు వచ్చయని,గత సీజన్ నుండి బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో ప్రతి శుక్రవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ
మరియు అవగాహన కార్యక్రమాలను గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నామని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహజ వ్యవసాయం గానీ సేంద్రీయ వ్యవసాయం గాని చేసి భావితరాలకు ఆరోగ్యం కరమైన పంటనే కాకుండా ఆరోగ్యకరమైన నేలను అందించాలని కోరారు అనంతరం తాండూరు మండల వ్యవసాయ అధికారి శ్రీమతి సుష్మ మాట్లాడుతూ సహజ వ్యవసాయంలో ఘనజీవామృతం, అగ్ని అస్త్రం మరియు వివిధ కషాయాలు తయారు చేసుకునే విధానాలను వివరించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి సిహెచ్ తిరుపతి గురజాల వ్యవసాయ విస్తరణ అధికారి గౌస్య బేగం ఇష్టం పేట వ్యవసాయ విస్తరణ అధికారి కె రాకేష్ అంకుశం సర్పంచ్ మరియు ఉద్యానవన అధికారిని అర్చన, రైతులు పాల్గొన్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.1
- మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1
- వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు2
- తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయాలని చూస్తున్న బిజెపి : ఖని లో జరిగిన స్ఫూర్తి సభలో సిపిఐ నేతలు కామ్రేడ్ కలవేని శంకర్, తాండ్ర సదానందం. తెలంగాణ సాయధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని,ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ , జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం లు డిమాండ్ చేశారు. మంగళ వారం స్థానిక మెయిన్ చౌరస్తా లో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోషిక మోహన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సీపీఐ కామ్రేడ్ కలవేన శంకర్, తాండ్ర సదానందం లు పూల మాలలు వేశారు.అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నీ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలన లో మగ్గుతూ అనేక అవస్ధలు పడుతున్నారని నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ,మఖ్దూం మోహియొద్దిన్ లు ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకొని నిజాం సేనలతో దొరలు భూస్వాములతో వీరోచితంగా పోరాడి 4500 మంది కమ్యూనిస్టులు అమరులైనారని అన్నారు.తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,షేక్ బందగి లాంటి ఎందరో వీరుల రక్తంతో తెలంగాణ గడ్డ ఎరుపెక్కిందని అన్నారు.మూడు వేల గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచారని తెలిపారు.ఇంతటి చారిత్రక పోరాటాన్ని బిజెపి హైజాక్ చేయాలని చూస్తున్నదని, హిందూ ముస్లిం అంటూ మతోన్మాదాన్ని పెంచి పోసిస్తున్నదని విమర్శించారు. కమ్యూనిస్టులు రజాకా ర్లతో చెలిమి చేశారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆరోపించారు. చరిత్ర తెలియని బిజెపి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తే చరిత్రహీనులుగా మిగులుతారని వారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె.కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య , కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ మాటే టి శంకర్,శనిగరపు చంద్రశేఖర్, ఆసాల రమ , రేణుకుంట్ల ప్రీతం,ఆసాల నవీన్, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, అబ్దుల్ కరీం,శనిగరపు తిరుమల,దుబాసి రేణుక , సుధీర్,గుంపుల కుమారస్వామి, కె.జగన్ ,జైపాల్ రెడ్డి,ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.3
- బండ్లగూడలో రౌడీ షీటర్ దారుణ హత్య?* హైదరాబాద్:సెప్టెంబర్ 15 మేడ్చల్ జిల్లా నాగోల్ పోలీసు స్టేషన్ పరిధి లోని బండ్లగూడ ప్రాంతంలో రౌడీ షీటర్ నయీమ్ ను కొంతమంది దుండ గులు సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణ భయంతో పక్కనే ఉన్న సుప్రీం వైన్స్ లోకి అతను వెళ్లిన దుండగులు వదలలేదు ఆ వైన్స్ లోనే దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. అనంతరం నిందితు లు అక్కడి నుంచి కారులో పరారయ్యా రు. ఈ హత్య గురించి సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నా రు. పరిస్థితిని పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్య కు గురైన వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ గా పోలీ సులు గుర్తించారు. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తు న్నామని, నిందితులు ఉపయోగించిన కారు ఆచూకీ కోసం, వారిని పట్టుకునేం దుకు ప్రత్యేక బృం దాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.1
- हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से काटा हैदराबाद: 15 सितंबर मेचल जिले के नागशोल (नागोल) पुलिस स्टेशन के अंतर्गत आने वाले बंडलागुडा इलाके में सोमवार रात कुछ अज्ञात हमलावरों ने एक राउडी शीटर की बेरहमी से हत्या कर दी। मृतक की पहचान भद्राद्री कोठागुडेम जिले के इलेन्दु निवासी राउडी शीटर नईम के रूप में हुई है। पुलिस से मिली जानकारी के अनुसार, हमलावरों से जान बचाकर भागने की कोशिश कर रहा नईम पास ही स्थित 'सुप्रीम वाइन शॉप' के अंदर घुस गया था। लेकिन, बेखौफ हमलावरों ने उसे बख्शा नहीं और वाइन शॉप के अंदर ही धारदार हथियारों से ताबड़तोड़ वार कर उसकी हत्या कर दी। इस सनसनीखेज वारदात को अंजाम देने के बाद आरोपी मौके से एक कार में सवार होकर फरार हो गए। पुरानी रंजिश हो सकती है वजह घटना की सूचना मिलते ही नागगोल पुलिस तुरंत हरकत में आई और मौके पर पहुंचकर स्थिति का जायजा लिया तथा साक्ष्य जुटाए। पुलिस का शुरुआती तौर पर मानना है कि इस हत्या के पीछे पुरानी रंजिश मुख्य कारण हो सकती है। विशेष टीमों का गठन पुलिस ने बताया कि घटनास्थल और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले जा रहे हैं। इसके साथ ही, आरोपियों द्वारा इस्तेमाल की गई कार का पता लगाने और फरार हमलावरों को दबोचने के लिए विशेष टीमों (स्पेशल पुलिस टीमों) का गठन कर सघन तलाशी अभियान शुरू कर दिया गया है।1