logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు, గీత కార్మిక సంఘం మండల నాయకులు, చేతి గుర్తుదారులు గౌరవాధ్యక్షుడు పురం అప్పారావు మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు దరఖాస్తులకు అవకాశం 18 తేదీ వరకు పొడిగించడం మంచి పరిణామం.. గజపతినగరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం జరిగినది ఇందులో పాల్గొన్నవారు డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు బి రాంబాబు కళ్ళు గీత కార్మిక సంఘం మండల నాయకులు ఎం నరసయ్య పాల్గొన్నారు ఈ పత్రిక సమావేశంలో చేతి వృత్తిదారుల గజపతినగరం నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పురం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 5వ తేదీన కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లు ఏడవ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్రామాలలో లోను పట్టణాలలో నున్న వార్డు సచివాలయాలలోనూ దరఖాస్తులు పెట్టవచ్చును అని ప్రభుత్వం ప్రకటించి పది రోజులు సమయం ఇచ్చినప్పటికీ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసిన వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పటికీ రెండు రోజులు అదనంగా అనగా 18వ తేదీ వరకు పొడిగించడం మంచి శుభ పరిణామం అయినప్పటికీ ఇంతకుముందే ఆయా చేతి వృత్తిదారులు అనగా కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకార కార్మికులు డప్పు కళాకారులు చెప్పులు తయారీదారుల ప్రతినిధులతోనూ సమావేశాలు మండలాల వారీగా ఏర్పాటు చేసి కార్మికులకు అవగాహన కల్పించే విధంగా గ్రామ సభల ద్వారా తెలియజేయవలసి ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రసారం ద్వారా ప్రకటించడం అర్హత గల పెన్షన్ దారులు అవగాహన లేక ఇంకా లక్షలాదిమంది రాష్ట్రంలో కానీ వేలాదిమంది జిల్లాలలో కానీ ఉన్నారు కనుక ఈనెల ఆఖరి వరకు పెన్షన్లకు అప్లై చేయడానికి సమయం ఇవ్వాలని పురం అప్పారావు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరి ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఎటువంటి సమస్యకైనా కొంత సమయము అంటే కొన్ని రోజులు అనగా వారం రోజులు 15 రోజులు నెల రోజులు ఇలా 90 రోజులు కడుపులో పరిష్కారం చేయవలసి ఉన్నది అదే విధంగా పెన్షన్లకు కూడా కనీసం 15 నుండి 30 రోజుల వరకు సమయం పొడిగిస్తే ఇంకా అర్హత గల వారందరూ పెన్షన్లు పొందగలరు అని అప్పారావు తెలిపిరి.

2 hrs ago
user_Sativada Venkatarao
Sativada Venkatarao
గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు, గీత కార్మిక సంఘం మండల నాయకులు, చేతి గుర్తుదారులు గౌరవాధ్యక్షుడు పురం అప్పారావు మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు దరఖాస్తులకు అవకాశం 18 తేదీ వరకు పొడిగించడం మంచి పరిణామం.. గజపతినగరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం జరిగినది ఇందులో పాల్గొన్నవారు డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు బి రాంబాబు కళ్ళు గీత కార్మిక సంఘం మండల నాయకులు ఎం నరసయ్య పాల్గొన్నారు ఈ పత్రిక సమావేశంలో చేతి వృత్తిదారుల గజపతినగరం నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పురం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 5వ తేదీన కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లు ఏడవ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్రామాలలో లోను పట్టణాలలో నున్న వార్డు సచివాలయాలలోనూ దరఖాస్తులు పెట్టవచ్చును అని ప్రభుత్వం ప్రకటించి పది రోజులు సమయం ఇచ్చినప్పటికీ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసిన వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పటికీ రెండు రోజులు అదనంగా అనగా 18వ తేదీ వరకు పొడిగించడం మంచి శుభ పరిణామం అయినప్పటికీ ఇంతకుముందే ఆయా చేతి వృత్తిదారులు అనగా కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకార కార్మికులు డప్పు కళాకారులు చెప్పులు తయారీదారుల ప్రతినిధులతోనూ సమావేశాలు మండలాల వారీగా ఏర్పాటు చేసి కార్మికులకు అవగాహన కల్పించే విధంగా గ్రామ సభల ద్వారా తెలియజేయవలసి ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రసారం ద్వారా ప్రకటించడం అర్హత గల పెన్షన్ దారులు అవగాహన లేక ఇంకా లక్షలాదిమంది రాష్ట్రంలో కానీ వేలాదిమంది జిల్లాలలో కానీ ఉన్నారు కనుక ఈనెల ఆఖరి వరకు పెన్షన్లకు అప్లై చేయడానికి సమయం ఇవ్వాలని పురం అప్పారావు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరి ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఎటువంటి సమస్యకైనా కొంత సమయము అంటే కొన్ని రోజులు అనగా వారం రోజులు 15 రోజులు నెల రోజులు ఇలా 90 రోజులు కడుపులో పరిష్కారం చేయవలసి ఉన్నది అదే విధంగా పెన్షన్లకు కూడా కనీసం 15 నుండి 30 రోజుల వరకు సమయం పొడిగిస్తే ఇంకా అర్హత గల వారందరూ పెన్షన్లు పొందగలరు అని అప్పారావు తెలిపిరి.

More news from Visakhapatanam and nearby areas
  • జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.
    1
    జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ
పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Visakhapatnam (Rural), Visakhapatanam•
    20 hrs ago
  • 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు 
శ్రీకాకుళం:  మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక  'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం................. మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం.................
మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి.  తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అనకాపల్లి నుండి శ్రీకాకుళం పుణ్యక్షేత్రాలకు ఉచిత తీర్థ యాత్ర ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సేవ అనకాపల్లి, సెప్టెంబర్ 16:ప్రజల సేవే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా, జీవీఎంసీ పరిధి 82వ వార్డు, నర్సింగరావుపేట, సాయి పద్మ అపార్ట్మెంట్ (BSNL ఆఫీస్ సమీపం) వాస్తవ్యులు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ కూర్మం, శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి బయలుదేరారు. ఈ యాత్రను MVR ట్రస్ట్ అధినేత, బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యాల సూర్యకుమారి కి సన్నిహితురాలైన శ్రీమతి తాటికొండ శ్రీ లక్ష్మి గారు మాట్లాడుతూ, MVR చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MVR చారిటబుల్ ట్రస్ట్ అనకాపల్లి ఇంచార్జి గైపురి రాజు , తాటికొండ కృష్ణమోహన్ , శాంతి , తీగల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
    2
    అనకాపల్లి నుండి శ్రీకాకుళం పుణ్యక్షేత్రాలకు ఉచిత తీర్థ యాత్ర
ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సేవ
అనకాపల్లి, సెప్టెంబర్ 16:ప్రజల సేవే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి.
అనకాపల్లి జిల్లా, జీవీఎంసీ పరిధి 82వ వార్డు, నర్సింగరావుపేట, సాయి పద్మ అపార్ట్మెంట్ (BSNL ఆఫీస్ సమీపం) వాస్తవ్యులు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ కూర్మం, శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి బయలుదేరారు.
ఈ యాత్రను MVR ట్రస్ట్ అధినేత, బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు  ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా  ముత్యాల సూర్యకుమారి కి సన్నిహితురాలైన శ్రీమతి తాటికొండ శ్రీ లక్ష్మి గారు మాట్లాడుతూ, MVR  చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో MVR చారిటబుల్ ట్రస్ట్ అనకాపల్లి ఇంచార్జి గైపురి రాజు , తాటికొండ కృష్ణమోహన్ , శాంతి , తీగల నగేష్  తదితరులు పాల్గొన్నారు.
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • త్రాగునీటిలో మురుగునీరు కలుషితం.... ఆందోళనలో గ్రామస్తులు.... మెళియాపుట్టి (M)మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి దుర్వాసన రావడంతో స్థానికులు పైపులను తవ్వి పరిశీలించగా మురుగునీరు కలిసినట్లు గుర్తించారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడంతో సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.
    2
    త్రాగునీటిలో మురుగునీరు కలుషితం....
ఆందోళనలో గ్రామస్తులు....
మెళియాపుట్టి (M)మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి దుర్వాసన రావడంతో స్థానికులు పైపులను తవ్వి పరిశీలించగా మురుగునీరు కలిసినట్లు గుర్తించారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడంతో సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.
    user_A.NAGI REDDY
    A.NAGI REDDY
    మేలియాపుట్టి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం *శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్నదాన (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం* జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామం లో కృష్ణాష్టమి సందర్భంగా18వ శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు భారీ సంఖ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుని గుడి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు నుండి భక్తులు,భారీ సంఖ్యలో వస్తారని అలాగే వచ్చిన వారికి కమిటీ ఆధ్వర్యంలో తగిన సౌకర్యాలు,జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరము లాగ కమిటీ పెద్దలు పర్యవేక్షణలో యూత్ కూడా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని జయంతి మొదటి రోజు నుండి చివరగా స్వామివారి అన్నదాన(అన్న ప్రసాద వితరణ) కార్యక్రమం జరిగేంతవరకు ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని యాదవ సంఘం కమిటీ పెద్దలు తెలియజేశారు శ్రీ స్వామి వివేకానంద స్కూల్ అధినేత ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. యాదవులు అంటే ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం యాదవులకె కల్పించారని, అలాగే ఈ ఊర్లో యాదవులలో సర్పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారని, యువత బాగా చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు పొందాలని అయన కోరారు
    3
    శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
*శ్రీ కృష్ణాష్టమి  సందర్భంగా వేల మందికి అన్నదాన (అన్నప్రసాద వితరణ)  కార్యక్రమం*
జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామం లో  కృష్ణాష్టమి సందర్భంగా18వ శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది 
ఈ సందర్భంగా కమిటీ వారు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో  ప్రజలకు భారీ సంఖ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు 
యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుని గుడి దగ్గర జరిగే  ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు నుండి భక్తులు,భారీ సంఖ్యలో వస్తారని అలాగే వచ్చిన వారికి కమిటీ ఆధ్వర్యంలో తగిన సౌకర్యాలు,జాగ్రత్తలు  తీసుకుంటామని తెలియజేశారు
అలాగే ప్రతి సంవత్సరము లాగ కమిటీ పెద్దలు పర్యవేక్షణలో  యూత్ కూడా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని జయంతి మొదటి రోజు నుండి చివరగా స్వామివారి అన్నదాన(అన్న ప్రసాద వితరణ)  కార్యక్రమం జరిగేంతవరకు ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని యాదవ సంఘం  కమిటీ పెద్దలు తెలియజేశారు
శ్రీ స్వామి వివేకానంద స్కూల్ అధినేత ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. యాదవులు అంటే ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి   మొదటి దర్శనం యాదవులకె కల్పించారని, అలాగే ఈ ఊర్లో యాదవులలో సర్పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారని,  యువత బాగా చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు పొందాలని అయన కోరారు
    user_S BUJJI
    S BUJJI
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    59 min ago
  • పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం
    1
    పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం
జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్  పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    3
    తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం 
*డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం*
జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ
కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15:
జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు.
అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి  జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    user_S BUJJI
    S BUJJI
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు
    1
    వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు
    user_ Srivani Nagabhatla
    Srivani Nagabhatla
    ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.