*మంత్రి పొంగులేటితో హౌసింగ్* *సొసైటీల జేఏసీ భేటీ*హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, ఈరోజు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీ అయ్యింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. నాలుగు హౌసింగ్ సొసైటీలలో దాదాపు 3,500మంది సభ్యులు ఉన్నట్లు మంత్రి దృష్టికి జేఏసీ తీసుకెళ్ళింది. ఈ విషయమై తాను ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల ఫలితం వచ్చేలా కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ రెడ్డి జేఏసీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డి కూడా పాల్గొన్నారు. మంత్రిని కలిసిన జేఏసీ ప్రతినిధి బృందంలో కె. విరాహత్ అలీ, ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, మురళీ క్రిష్ణ, గోపరాజు, రవీంద్ర బాబు, సూరజ్ కుమార్, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.
*మంత్రి పొంగులేటితో హౌసింగ్* *సొసైటీల జేఏసీ భేటీ*హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, ఈరోజు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీ అయ్యింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. నాలుగు హౌసింగ్ సొసైటీలలో దాదాపు 3,500మంది సభ్యులు ఉన్నట్లు మంత్రి దృష్టికి జేఏసీ తీసుకెళ్ళింది. ఈ విషయమై తాను ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల ఫలితం వచ్చేలా కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ రెడ్డి జేఏసీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డి కూడా పాల్గొన్నారు. మంత్రిని కలిసిన జేఏసీ ప్రతినిధి బృందంలో కె. విరాహత్ అలీ, ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, మురళీ క్రిష్ణ, గోపరాజు, రవీంద్ర బాబు, సూరజ్ కుమార్, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కలెక్టర్ ప్రతిమా సింగ్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలోశ్యాంసుందర్, -భౌతికశాస్త్ర బోధనతో అధ్యాపకులు -ఇంచార్జి ప్రిన్సిపాల్స్వర్ణలత ,-వృక్షశాస్త్ర అధ్యాపకులు అరవింద్ రెడ్డి, -రసాయనశాస్త్ర అధ్యాపకులువెంకటేశ్వర్లు -అర్ధశాస్త్ర అధ్యాపకులుప్రమోద్కుమార్ -కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.1
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*1
- తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం కలెక్టర్ జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్ జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు1
- హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.1