Shuru
Apke Nagar Ki App…
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు విద్యా శాఖాధికారులు సీనియారిటీ జాబితా విడుదల చేశారని VZM DEO మాణిక్యంనాయుడు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో తప్పులు ఉంటే నేటి నుంచి ఈనెల 26 వరకు DEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. GO నం.610 ద్వారా బదిలిపై వచ్చిన ఉపాధ్యాయులు DSC మార్కులు, ర్యాంక్ వివరాలను అందజేయాలన్నారు. టీచర్లకు గుడ్డ్యూస్.. జాబితా విడుదల
B.RAJESH
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు విద్యా శాఖాధికారులు సీనియారిటీ జాబితా విడుదల చేశారని VZM DEO మాణిక్యంనాయుడు తెలిపారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో తప్పులు ఉంటే నేటి నుంచి ఈనెల 26 వరకు DEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. GO నం.610 ద్వారా బదిలిపై వచ్చిన ఉపాధ్యాయులు DSC మార్కులు, ర్యాంక్ వివరాలను అందజేయాలన్నారు. టీచర్లకు గుడ్డ్యూస్.. జాబితా విడుదల
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- అరసవల్లి , ఏప్రిల్,20: ఆహార పదార్థాల్లో హానికారక రంగులు ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అరసవెల్లి అసిరి తల్లి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరీతల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా, ప్రదర్శనశాల ప్రాంతంలో దాని పరిసరాల్లో 11 ఆహార భద్రతా తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. స్టాళ్లలో ఫాస్ట్ ఫుడ్ (మంచూరియా, నూడుల్స్), ఐస్ క్రీమ్ , మస్కా బన్, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. తనిఖీ సమయంలో కనుగొన్న విషయాలు: షుగర్ క్యాండీని అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేశారు.ఆ ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి,వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీచేశారు. కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించవద్దు: గడువు ముగిసిన లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దు సరైన పరిశుభ్రత ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రతను నిర్ధారించడానికి, విక్రేతలందరూ FSSAI నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. . ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని ఎటువంటి నిషేధిత రంగులని, ప్రామాణికము కానీ ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కే .లక్ష్మీ పాల్గొన్నారు1
- డుంబ్రిగూడ, ఏప్రిల్ 21: మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలకు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ మార్గంలో విద్యార్థులు, స్థానికులు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చేతికందే స్థాయిలో తీగలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.1
- శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామపంచాయతీ సెలగ పేట జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కు సంతబొమ్మాలి మండలం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలలో 25 సంవత్సరాలు యువకుడిలా రాష్ట్రం కోసం రాత్రి పగలు రోజుకి 20 గంటలు నిద్ర హారాలు మాని పనిచేస్తున్నారని నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశానని ఈ కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న పరిపాలన ఎన్నడు జరగలేదని అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి చల్లగా ఉండే రాష్ట్రం మరింత ప్రగతి పదములు నడవాలని చంద్రబాబు నాయుడుకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు భగవంతుడు కలిగించాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాంప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...4
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమదాలవలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద ఎత్తున ప్రజలకు ఉచిత భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవాభావాన్ని ప్రదర్శించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చిన పేద ప్రజలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు స్వయంగా ఆహారం అందించి వారి మనసులను గెలుచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నిల్చొని భోజనం చేశారు సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి అభిప్రాయాలు భోజనం నాణ్యత తెలుసుకున్నారు . ప్రజలతో మమేకమై మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ద్వారా నాయకత్వం యొక్క నిజమైన విలువ వెలుగుచూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.4