logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పంట రక్షణ విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి: CI రమేష్ ADB: నేరడిగొండ మండలంలో మొక్కజొన్న పంటకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ రూపేష్ కుమార్ మృతి చెందినట్లు CI రమేష్ మంగళవారం తెలిపారు. పంట రక్షణ పేరుతో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన చంద్రబాన్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

9 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
9 hrs ago
ba159450-ed67-450c-b8ac-25895d229969

పంట రక్షణ విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ మృతి: CI రమేష్ ADB: నేరడిగొండ మండలంలో మొక్కజొన్న పంటకు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి లారీ క్లీనర్ రూపేష్ కుమార్ మృతి చెందినట్లు CI రమేష్ మంగళవారం తెలిపారు. పంట రక్షణ పేరుతో అక్రమ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన చంద్రబాన్‌పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • kamaraddy dist banswada lo ex m la bajirddy press meet, news
    1
    kamaraddy dist banswada lo ex  m la bajirddy press meet, news
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • చెరువును తలపిస్తున్న భీంపూర్ మండలంలోని ప్రధాన రహదారులు భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    1
    చెరువును తలపిస్తున్న భీంపూర్ మండలంలోని ప్రధాన రహదారులు
భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము


న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • *నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన * *దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వాలు* *విఫలమయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు* క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్, పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అణచివేత, బానిసత్వం, అస్తిత్వ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారన్నారు. తెలంగాణ రాష్త్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చిన బీఆర్ఎస్, కాంగ్రేస్లు... కేవలం ఓ వర్గం ఓట్ల కోసం, వారి మెప్పు కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 17న ఉదయం ప్రతి బూత్ స్తాయిలో పార్టీ ఆద్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని, *నరేంద్ర మోది 28 యేళ్ల* *సుదీర్ఘ ప్రజా సేవను* *దీవించేలా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా* *సాయంత్రం 7 గంటలకు* *ప్రతి ఇంటి ముందు* *ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు* కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద రాష్ట్ర నాయకులు అశోక్. జిల్లా అధికార ప్రతినిధి. gv రమణ. సుభాష్ శైలేందర్ . రమేష్ అంకత్. శేఖవత్. వెంకటస్వామి. దేవన్న. రాకేష్ తదితరులు పాల్గొన్నారు
    3
    *నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన
*
*దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వాలు*
*విఫలమయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు*
క్యాంపు కార్యాలయంలో బీజేపీ
జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్, పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో
మాట్లాడారు. అణచివేత, బానిసత్వం, అస్తిత్వ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఎంతో మంది
అమరులయ్యారన్నారు. తెలంగాణ రాష్త్రంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని
అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చిన బీఆర్ఎస్, కాంగ్రేస్లు... కేవలం ఓ వర్గం ఓట్ల కోసం,
వారి మెప్పు కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టగానే
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. 17న ఉదయం ప్రతి
బూత్ స్తాయిలో పార్టీ ఆద్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని, *నరేంద్ర మోది 28 యేళ్ల*
*సుదీర్ఘ ప్రజా సేవను* *దీవించేలా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా* *సాయంత్రం 7 గంటలకు*
*ప్రతి ఇంటి ముందు* *ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు* కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద రాష్ట్ర నాయకులు అశోక్. జిల్లా అధికార ప్రతినిధి.     gv రమణ. సుభాష్ శైలేందర్ . రమేష్ అంకత్. శేఖవత్. వెంకటస్వామి. దేవన్న. రాకేష్ తదితరులు పాల్గొన్నారు
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • సీసీఐపై ఎమ్మెల్యే,ఎంపీ స్పందించాలి : టీఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌ ఆదిలాబాద్‌: సీసీఐ సిమెంట్‌ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌ డిమాండ్‌ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. సీసీఐ సాధన రిలే దీక్షలు మంగళవారం 38వ రోజుకు చేరగా TAGS జిల్లా కమిటీ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ఆదిలాబాద్‌ అభివృద్ధికి చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో TAGS జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్‌ సక్కు, పెందూర్‌ గోవింద్‌, మెస్రం నగేష్‌, కుంర దివంజి, కుంరం భీంరావు తదితరులు పాల్గొన్నారు.
    1
    సీసీఐపై ఎమ్మెల్యే,ఎంపీ స్పందించాలి : టీఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌
ఆదిలాబాద్‌: సీసీఐ సిమెంట్‌ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్‌ డిమాండ్‌ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. సీసీఐ సాధన రిలే దీక్షలు మంగళవారం 38వ రోజుకు చేరగా TAGS జిల్లా కమిటీ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ఆదిలాబాద్‌ అభివృద్ధికి చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో TAGS జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్‌ సక్కు, పెందూర్‌ గోవింద్‌, మెస్రం నగేష్‌, కుంర దివంజి, కుంరం భీంరావు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Shaikshada
    1
    Post by Shaikshada
    user_Shaikshada
    Shaikshada
    Dancer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    1
    శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    10 hrs ago
  • *చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* *అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలి.* *ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచన.* గణపతి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా *చాంద టి* వద్ద నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆప్యాయతతో ఎస్పీకి గణపతి నిమజ్జన పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    *చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*

*అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలి.*

*ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచన.*
గణపతి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా *చాంద టి* వద్ద నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆప్యాయతతో ఎస్పీకి గణపతి నిమజ్జన పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.