logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సానిక పుల్లయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసై, కుటుంబ కలహాల కారణంగా శనివారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 ఈఎంటి గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు కట్టం మహేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు బాధితుడికి ఆక్సిజన్ అందిస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ, ధైర్యాన్ని చెబుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సత్వర వైద్య సదుపాయం అందడంతో సానిక పుల్లయ్య ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది సేవలను ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజరుద్దీన్, 108 మేనేజర్ ఆవులూరి దుర్గా ప్రసాద్ మరియు గ్రామస్తులు అభినందించారు.

4 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
4 hrs ago
50a94f50-7ebd-4436-b898-1ef0f774f8c4

ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సానిక పుల్లయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసై, కుటుంబ కలహాల కారణంగా శనివారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 ఈఎంటి గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు కట్టం మహేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు బాధితుడికి ఆక్సిజన్ అందిస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ, ధైర్యాన్ని చెబుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సత్వర వైద్య సదుపాయం అందడంతో సానిక పుల్లయ్య ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది సేవలను ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజరుద్దీన్, 108 మేనేజర్ ఆవులూరి దుర్గా ప్రసాద్ మరియు గ్రామస్తులు అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    3
    సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    4
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    59 min ago
  • ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం రేవంత్, కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపాలని కేటీఆర్ కోరుతున్నారని, ఆయన కన్నెపల్లి వెళ్ళిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు.

మేడిగడ్డ ప్రాజెక్టులో నీటిని నింపడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రేవంత్ హెచ్చరించారు. ఒకవేళ అలా చేస్తే మేడిగడ్డ కట్ట తెగిపోయి, భద్రాచలం ప్రాంతమే ఉండదని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. దీనివల్ల 44 గ్రామాలు కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాద్రి రాముడే లేకుండా పోతారని పేర్కొన్నారు. కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం భద్రాచలాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    1
    చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    1
    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు.

గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మంలో సురక్షితమైన మరియు విలువ పెరిగే పెట్టుబడి కోసం చూస్తున్న వారికి శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రాంత పరిస్థితులతో సంబంధం లేకుండా తెలివైన పెట్టుబడిని ఎంచుకోవాలని సూచించడమైనది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఓపెన్ ప్లాట్లు DTCP మరియు RERA ద్వారా ఆమోదం పొందాయి. మరిన్ని వివరాలు మరియు పెట్టుబడి అవకాశాల కోసం 8008165564 నంబర్‌ను సంప్రదించవచ్చు.
    1
    ఖమ్మంలో సురక్షితమైన మరియు విలువ పెరిగే పెట్టుబడి కోసం చూస్తున్న వారికి శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రాంత పరిస్థితులతో సంబంధం లేకుండా తెలివైన పెట్టుబడిని ఎంచుకోవాలని సూచించడమైనది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఓపెన్ ప్లాట్లు DTCP మరియు RERA ద్వారా ఆమోదం పొందాయి. మరిన్ని వివరాలు మరియు పెట్టుబడి అవకాశాల కోసం 8008165564 నంబర్‌ను సంప్రదించవచ్చు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.