ఉప్పల్ నియోజకవర్గంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి మంత్రి కి ఎమ్మెల్యే విజ్ఞప్తి.(హైదరాబాద్)సెప్టెంబర్ 15: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని శ్మశాన వాటికలు, సమాధి స్థలాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కోరారు.ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతిపత్రం సమర్పించారు.ఉప్పల్ నియోజకవర్గం అత్యంత జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతమని, నియోజకవర్గంలో అనేక పాత, కొత్త కాలనీలు విస్తరించి ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అనేక శ్మశాన వాటికలు, సమాధి స్థలాలు ఏళ్ల క్రితం ఏర్పాటు కావడంతో ప్రస్తుతం సరైన నిర్వహణ లేక అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.ప్రజలు తమ ఆత్మీయులను కోల్పోయిన సమయంలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సమస్య మరింత భారంగా మారుతోందని ఎమ్మెల్యే వివరించారు.శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత,నియోజకవర్గంలోని శ్మశాన వాటికల్లో ప్రధానంగా ప్రహరీ గోడలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు,సీసీ రోడ్లు, అంతర్గత మార్గాలు,కుటుంబ సభ్యులు వేచి ఉండేందుకు షెడ్లు, వెయిటింగ్ హాళ్లు,తాగునీటి సదుపాయం,మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లు,విద్యుత్, సరైన లైటింగ్ సదుపాయాలు, ఆధునిక విద్యుత్/గ్యాస్ ఆధారిత దహన వాటికలు,దహన వేదికల ఆధునీకరణ,పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్య.సదుపాయాలు,వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరిగేలా శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి నిధులు మంజూరు చేయాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు.ఉప్పల్ నియోజకవర్గంలోని శ్మశాన వాటికల అభివృద్ధి, ఆధునీకరణకు ప్రత్యేకంగా అవసరమైన గ్రాంట్/నిధులు మంజూరు చేసి, ప్రహరీ గోడలు, షెడ్లు, ఆధునిక దహన వాటికలు, నీరు, విద్యుత్, లైటింగ్ తదితర సౌకర్యాల ఏర్పాటుకు సహకరించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యే కోరారు.ప్రజలకు ఎంతో అవసరమైన ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు1
- సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.4
- కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు లైవ్ మర్డర్ వీడియో..! ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్ సెటిల్మెంట్ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..? నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్ పోలీసుల గాలింపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 హైదరాబాద్ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు నెలలుగా వివాదం.. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్, నహీమ్ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ అండ్ టీం కోసం గాలింపు హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.1