logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడండి.. వ్యాక్సిన్ వేయించుకోండి* *బాలికలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన* *కురుగుంట పీ.హెచ్.సిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత* *వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత ఆదేశం* *కస్తూరిబా పాఠశాల అదనపు భవనాలు, సిసి రోడ్డు నిర్మాణాల పరిశీలన* *ఎమ్మెల్యేను కలసిన రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు* హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడి 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కురుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రారంభించిన హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి వ్యాక్సిన్ ఎంత మందికి వేయించారు.. పిల్లల తల్లిదండ్రులు దీనిపై ఏమంటున్నారు వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమైందన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం రోజున దీనిని ప్రారంభించారన్నారు. 14సంవత్సరాలు వయసు పూర్తి అయి 15సంవత్సరాల వయసు లోపల కలిగిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి మొదట చెప్పినప్పుడు చాలా మందిలో అపోహలు ఏర్పాడ్డాయన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుండెపోటు వస్తోందన్న ప్రచారం కూడా జరిగిందన్నారు. కానీ ఈవ్యాక్సిన్ల వలన ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఇటీవల పెరిగిపోతున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రైవేట్ గా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే సుమారు 12 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మహిళల్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. పిల్లల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత సూచించారు. అనంతరం కురుగుంట కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల అదనపు భవనాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే పాపంపేట, వివేకానంద నగర్ లో 20లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. *ఎమ్మెల్యే సునీతను కలిసిన సహకార పరపతి సంఘం సభ్యులు* రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) నూతన కమిటీ సభ్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. రుద్రంపేట నూతన అధ్యక్షునిగా నియమితులైన కాటిగాని కాలువ శ్రీనివాసులు, సభ్యులు ఆలమూరు బాల నరసింహులు, కక్కలపల్లి పేట వన్నూరప్ప మరియు తాడిమర్రి నూతన అధ్యక్షునిగా నియమితులైన కునుకుంట్ల శ్రీనివాస రెడ్డి, సభ్యులు పిన్నదరి రమణ, మరువపల్లి లక్ష్మీనారాయణ గార్లు స్థానిక మండల నాయకులతో కలిసి అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. తమకు పదవులు ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే సునీత శుభాకాంక్షాలు తెలిపారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. మెరుగైన సేవలు అందించాలని సూచించారు....

on 14 March
user_Thiruveedhula Rameshnaidu
Thiruveedhula Rameshnaidu
Farmer ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
on 14 March
b412e6a2-76ae-4bba-a590-ba25968787bf

*హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడండి.. వ్యాక్సిన్ వేయించుకోండి* *బాలికలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన* *కురుగుంట పీ.హెచ్.సిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత* *వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత ఆదేశం* *కస్తూరిబా పాఠశాల అదనపు భవనాలు, సిసి రోడ్డు నిర్మాణాల పరిశీలన* *ఎమ్మెల్యేను కలసిన రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు* హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడి 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కురుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రారంభించిన హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి వ్యాక్సిన్ ఎంత మందికి వేయించారు.. పిల్లల తల్లిదండ్రులు దీనిపై ఏమంటున్నారు వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమైందన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం రోజున దీనిని ప్రారంభించారన్నారు. 14సంవత్సరాలు వయసు పూర్తి అయి 15సంవత్సరాల వయసు లోపల కలిగిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి మొదట చెప్పినప్పుడు చాలా మందిలో అపోహలు ఏర్పాడ్డాయన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుండెపోటు వస్తోందన్న ప్రచారం కూడా జరిగిందన్నారు. కానీ ఈవ్యాక్సిన్ల వలన ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఇటీవల పెరిగిపోతున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రైవేట్ గా ఈ

8bcd935b-64c5-427e-97b2-e9757c44ac6e

వ్యాక్సిన్ వేయించుకోవాలంటే సుమారు 12 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మహిళల్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. పిల్లల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత సూచించారు. అనంతరం కురుగుంట కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల అదనపు భవనాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే పాపంపేట, వివేకానంద నగర్ లో 20లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. *ఎమ్మెల్యే సునీతను కలిసిన సహకార పరపతి సంఘం సభ్యులు* రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) నూతన కమిటీ సభ్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. రుద్రంపేట నూతన అధ్యక్షునిగా నియమితులైన కాటిగాని కాలువ శ్రీనివాసులు, సభ్యులు ఆలమూరు బాల నరసింహులు, కక్కలపల్లి పేట వన్నూరప్ప మరియు తాడిమర్రి నూతన అధ్యక్షునిగా నియమితులైన కునుకుంట్ల శ్రీనివాస రెడ్డి, సభ్యులు పిన్నదరి రమణ, మరువపల్లి లక్ష్మీనారాయణ గార్లు స్థానిక మండల నాయకులతో కలిసి అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. తమకు పదవులు ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే సునీత శుభాకాంక్షాలు తెలిపారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. మెరుగైన సేవలు అందించాలని సూచించారు....

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    1
    ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది.
ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు.
ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    14 hrs ago
  • మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    1
    మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది.
ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చిత్తూరు జిల్లా...కుప్పం కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత రాప్తాడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గిరీష్ రెడ్డి అరెస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు పైసోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలు చేసినందుకు చర్యలు కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నెంబర్ 76/2026 కింద పలు సెక్షన్లతో కేసు నమోదు 196(1), 352, 353(2), 336(1), 340(2), 61(2), 111 (76 ITA 2000-2008) ప్రకారం కూడా కేసు నమోదు అరెస్ట్ అనంతరం నిందితుడిని కుప్పం కోర్టుకు తరలించిన పోలీసులు కేసు వాదనలు వినిపించేందుకు విజయవాడ నుంచి వైసీపీ పార్టీ లాయర్ పోన్నవోలు కోర్టు వద్ద భారీగా వైసీపీ నాయకుల సమీకరణ చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు హాజరు కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన పోలీసులు
    1
    చిత్తూరు జిల్లా...కుప్పం
కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత
రాప్తాడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గిరీష్ రెడ్డి అరెస్ట్
ఏపీ సీఎం చంద్రబాబు పైసోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలు చేసినందుకు చర్యలు
కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు
ఎఫ్‌ఐఆర్ నెంబర్ 76/2026 కింద పలు సెక్షన్లతో కేసు నమోదు
196(1), 352, 353(2), 336(1), 340(2), 61(2), 111 (76 ITA 2000-2008) ప్రకారం కూడా కేసు నమోదు
అరెస్ట్ అనంతరం నిందితుడిని కుప్పం కోర్టుకు తరలించిన పోలీసులు
కేసు వాదనలు వినిపించేందుకు విజయవాడ నుంచి వైసీపీ పార్టీ లాయర్ పోన్నవోలు 
కోర్టు వద్ద భారీగా వైసీపీ నాయకుల సమీకరణ
చిత్తూరు వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భరత్, మండల నాయకులు, కార్యకర్తలు హాజరు
కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం
భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన పోలీసులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    4 hrs ago
  • వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    1
    వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    1
    హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త... మహారాష్ట్రలోని నాసిక్ లో హిందూ అమ్మాయిని టార్గెట్ చేసిన జిహాదీలు..
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    1
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    1
    ఎమ్మిగనూరులో స్కూల్ అభివృద్ధికి శ్రీకారం – తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.