గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా - డాక్టర్ నిఖత్ అంజుం, ప్రిన్సిపాల్. గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 8 ఐ3 న్యూస్/ రిపోర్టర్ ఖదీర్ : స్థానిక గజ్వేల్ పట్టణం బాయ్స్ హబ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు (కో ఎడ్యుకేషన్) అటానమస్ హోదా కల్పిస్తూ న్యూఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మంగళవారం నాడు ఉత్తర్వులను వెలువరించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఈ స్వయం ప్రతిపత్తి హోదా ఐదు సంవత్సరాల పాటు అనగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2029-2030 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. కళాశాలకి ఈ హోదా రావడం వల్ల పట్టణ ప్రజలకు మరియు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆమె తెలిపారు. కళాశాలకి ఈ హోదా రావడంలో తోడ్పాటు అందించిన కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర సింగ్, ఆర్జెడి డాక్టర్ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ బాల భాస్కర్ తదితరులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాలకి అటానమస్ హోదా రావడంలో విశేషంగా కృషిచేసిన కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.గణపతి రావు, కళాశాల అధ్యాపకులు కెప్టెన్ & డాక్టర్ ఎం. భవాని తదితర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం కళాశాల, ప్రిన్సిపాల్, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది బాణసంచా పేల్చి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్ గణపతి రావు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ డి. వెంకటేష్, అకాడమీక్ కోఆర్డినేటర్ కెప్టెన్ & డాక్టర్ ఎం. భవాని, కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎం. అలివేలు, డాక్టర్ ఆర్.మహేందర్ రెడ్డి, డాక్టర్ ఎస్.మహేందర్, డాక్టర్ వై. రామచంద్రం, డాక్టర్ జి. విజయ భాస్కర్ రెడ్డి, డాక్టర్ పెద్దిరాజు, డాక్టర్ కవిత, డాక్టర్ లక్ష్మీనరసయ్య, వెంకటరమణ, చాంద్ పాషా, సాయి రమేష్, నగేష్, తిరుపతి, ఖలీల్, అమలా దేవి, మార్కండేయ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.