logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఓయూ నూతన పరిపాలన భవనంకు అంబేద్కర్ పూలే పేరు పెట్టాలి : ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_దినేష్ కుమార్
దినేష్ కుమార్
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
4 hrs ago

ఓయూ నూతన పరిపాలన భవనంకు అంబేద్కర్ పూలే పేరు పెట్టాలి : ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ

జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో

135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్,

అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ

నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
    1
    సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆
    5
    More details to buy
Watsup 8374614046
👆👆👆👆👆👆👆
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bantwaram, Vikarabad•
    1 hr ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. 
అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    1
    నల్లగొండ బ్రేకింగ్: 
నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు..
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ...
అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి...
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు...
అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    7 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    7 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో In మై యూట్యూబ్ ఛానల్ id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో In మై యూట్యూబ్ ఛానల్ 
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Bantwaram, Vikarabad•
    2 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    1
    పత్రిక ప్రకటన 
తేది :14.04.2026
కామారెడ్డి జిల్లా, మంగళవారం
ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు  హెల్మెట్లు అందజేశారు. 
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గం:-
ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.