logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాల మహాసభ కూటమి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల విషయంలో చేస్తున్న కుట్రలను, ఏజెన్సీ ప్రాంతంలోని అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకుగాను నిర్వహించనున్న సమావేశ వివరాలు: తేది: 22-02-2026 (ఆదివారం) సమయం: ఉదయం 11.30 గంటలకు వేదిక: మోదకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం, పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ అంశంపై ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజికవేత్తలు తప్పనిసరిగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై తమ విలువైన సూచనలు అందించవలసిందిగా వినయపూర్వక ఆహ్వానం. మీరు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఎమ్మెల్యే, పాడేరు నియోజకవర్గం

4 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
4 hrs ago
1c60a6f9-0181-479a-847a-bc0177154e92

ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాల మహాసభ కూటమి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల విషయంలో చేస్తున్న కుట్రలను, ఏజెన్సీ ప్రాంతంలోని అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకుగాను నిర్వహించనున్న సమావేశ వివరాలు: తేది: 22-02-2026 (ఆదివారం) సమయం: ఉదయం 11.30 గంటలకు వేదిక: మోదకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం, పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ అంశంపై ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజికవేత్తలు తప్పనిసరిగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై తమ విలువైన సూచనలు అందించవలసిందిగా వినయపూర్వక ఆహ్వానం. మీరు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఎమ్మెల్యే, పాడేరు నియోజకవర్గం

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజవొమ్మంగిలో ఎంప్లాయిస్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోక పోవడంతో చెట్లు, పొదలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా విషసర్పాలకు నిలయంగా మారిందని చుట్టూ ప్రక్కల నివాసం ఉంటున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీటిని తొలగించాలని కోరుతున్నారు.
    1
    రాజవొమ్మంగిలో ఎంప్లాయిస్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోక పోవడంతో చెట్లు, పొదలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా విషసర్పాలకు నిలయంగా మారిందని చుట్టూ ప్రక్కల నివాసం ఉంటున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి వీటిని తొలగించాలని కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    25 min ago
  • అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా  ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    50 min ago
  • ముందస్తు పనులు లేవు.. మండుటెండల్లో రక్షణ లేదు: ఉపాధి కూలీల గోస కొమరాడలో సిపిఎం ఆధ్వర్యంలో కూలీల నిరసన అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం కొమరాడ ఒకవైపు 125 రోజుల పని కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పాత పనులు పూర్తయి, కొత్త పనులు మంజూరు కాక ఉపాధి హామీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 31 పంచాయతీల్లో పాత పనులు పూర్తయ్యాయని, కొత్త పనులు ప్రారంభించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ వంటి మండుటెండల్లో పనులు ప్రారంభించడం అంటే కూలీల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. గతంలో పని ప్రదేశంలో మంచినీరు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ సరఫరా చేసేవారని, ఇప్పుడు అవి ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. కూలీలకు కనీసం గమేలాలు, పారలు, గునపాలు వంటి పనిముట్లు కూడా అందడం లేదని అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా ఉపాధి కూలీని రోజుకు ₹600లకు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. 2005లో వామపక్షాల మద్దతుతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి, కొత్తగా తెచ్చిన నిబంధనల వల్ల కూలీలు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో గొప్పలు చెబుతూ, చేతల్లో కూలీలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. వెంటనే అన్ని గ్రామాల్లో కొత్త పనులు ప్రారంభించి, పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. తక్షణమే మండలంలోని అన్ని పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించకపోతే, కూలీలందరినీ ఐక్యం చేసి ఎంపీడీవో (MPDO) కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ముందస్తు పనులు లేవు.. మండుటెండల్లో రక్షణ లేదు: ఉపాధి కూలీల గోస
కొమరాడలో సిపిఎం ఆధ్వర్యంలో కూలీల నిరసన  అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం
కొమరాడ 
ఒకవైపు 125 రోజుల పని కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పాత పనులు పూర్తయి, కొత్త పనులు మంజూరు కాక ఉపాధి హామీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 31 పంచాయతీల్లో పాత పనులు పూర్తయ్యాయని, కొత్త పనులు ప్రారంభించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ వంటి మండుటెండల్లో పనులు ప్రారంభించడం అంటే కూలీల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.
గతంలో పని ప్రదేశంలో మంచినీరు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ సరఫరా చేసేవారని, ఇప్పుడు అవి ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. కూలీలకు కనీసం గమేలాలు, పారలు, గునపాలు వంటి పనిముట్లు కూడా అందడం లేదని అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా ఉపాధి కూలీని రోజుకు ₹600లకు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. 2005లో వామపక్షాల మద్దతుతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి, కొత్తగా తెచ్చిన నిబంధనల వల్ల కూలీలు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో గొప్పలు చెబుతూ, చేతల్లో కూలీలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. వెంటనే అన్ని గ్రామాల్లో కొత్త పనులు ప్రారంభించి, పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. తక్షణమే మండలంలోని అన్ని పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించకపోతే, కూలీలందరినీ ఐక్యం చేసి ఎంపీడీవో (MPDO) కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 min ago
  • దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    4
    దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర  స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో   మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 
*నేడు త్రిశూల స్నానం*
మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా  పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    14 hrs ago
  • సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    4
    సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    1
    పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు  వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    1
    జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.