logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రభుత్వ నిర్ణీత ధరకే రైతులకు ఎరువులు సరఫరా చేయాలన్న సదాశయంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌పై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో దళారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించేవారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని చైర్మన్ గుర్తు చేశారు. యూరియా యాప్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నియంత్రించవచ్చని, అంతేకాకుండా దుకాణాల వద్ద రోజువారీగా నిల్వలు ఎంత మేర ఉన్నాయో ఎప్పటికప్పుడు యాప్ లో తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే, రైతులు తమ పట్టా పాసుపుస్తకాలు దళారులకు ఇస్తే యాప్ లో స్లాట్ బుక్ చేసి యూరియా పక్కదారి మలించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ కేంద్రే శివాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పెందుర్ గణపత్, సర్పంచు విజయలక్ష్మి బీర్షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్రం నాగో రావు, సీ ఈ ఓ కనక రమేష్, అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

17 hrs ago
user_Shaik Arif
Shaik Arif
సిర్పూర్ యు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
17 hrs ago
7b3856ac-f423-49b0-900a-bf8b5b3d2de1

ప్రభుత్వ నిర్ణీత ధరకే రైతులకు ఎరువులు సరఫరా చేయాలన్న సదాశయంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌పై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో దళారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించేవారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారని చైర్మన్ గుర్తు చేశారు. యూరియా యాప్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా నియంత్రించవచ్చని, అంతేకాకుండా దుకాణాల వద్ద రోజువారీగా నిల్వలు ఎంత మేర ఉన్నాయో ఎప్పటికప్పుడు యాప్ లో తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయితే, రైతులు తమ పట్టా పాసుపుస్తకాలు దళారులకు ఇస్తే యాప్ లో స్లాట్ బుక్ చేసి యూరియా పక్కదారి మలించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ కేంద్రే శివాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పెందుర్ గణపత్, సర్పంచు విజయలక్ష్మి బీర్షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్రం నాగో రావు, సీ ఈ ఓ కనక రమేష్, అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • *షార్ట్ సర్క్యూట్‍ ప్రమాదాలు కావు అవి.... పాలకుల ప్రయోజనార్దం కుట్రా…?* ఇన్నాళ్ళు మనం ..ప్రభుత్వాలు మారేముందు… ఎన్నికలు దగ్గర పడుతున్నపుడు సచివాలయం .. మంత్రుల పేశి లో అగ్ని ప్రమాదాలు చూసాం 🔹 ఇపుడు EVM ల వంతు వచ్చింది - వెస్ట్‌ బెంగాల్‌లో కాలిపోయిన 4,000 EVM లు 🔹 కోల్‌కతా అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో EVM లు దహనం 🔹 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడిన EVM గా గుర్తింపు ఆధారాలు ఉండకూడదు అనే కుట్ర తో షార్ట్‍ సర్క్యూట్‍ అనే టెక్నికల్‍ ను అడ్డం పెట్టుకుని పాలకులు చేస్తున్న ఆరాచకాలే ఈ ప్రమాదాలు 👉 *ఉమ్మడి ఆంద్రప్రదేష్‍ లో ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని అగ్ని ప్రమాదాలు వాటి వివరాలు* ⭕ 1999 ఉమ్మడి ఆంద్రప్రదేష్‍ చంద్రాబాబు పాలన కాలంలో ఎన్నికల ముందు అగ్ని ప్రమాదం ⭕ 2004 లో ఎన్నికల జరిగి చంద్రబాబు ప్రభుత్వం మారి YS ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే ఊహాలు వస్తున్న తరునం లో....... ఫలితాలకు ముందు A బ్లాక్‍ , G, బ్లాక్‍ లో అగ్ని ప్రమాదం . ⭕ 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో (ఫలితాలు వచ్చే ముందు) ఆర్థిక శాఖ , అటవి శాఖ , I T శాఖ కు చెందిన D బ్లాక్‍ లో అగ్ని ప్రమాదాలు. 🤦‍♀️🤦‍♀️ సచివాలయం , మంత్రుల కార్యాలయాలు EVM స్ట్రాంగ్‍ రూములలో జరిగినవన్ని టెక్నికల్‍ గా షార్ట్ సర్క్యూట్‍ ప్రమాదాలే కానీ ప్రయోజనం ఎవరికో అందరికి తెలుసు…. #VSK
    1
    *షార్ట్ సర్క్యూట్‍ ప్రమాదాలు కావు అవి.... పాలకుల ప్రయోజనార్దం కుట్రా…?*
ఇన్నాళ్ళు   మనం ..ప్రభుత్వాలు మారేముందు… ఎన్నికలు దగ్గర పడుతున్నపుడు సచివాలయం .. మంత్రుల పేశి లో  అగ్ని ప్రమాదాలు చూసాం
🔹 ఇపుడు EVM ల వంతు వచ్చింది  - వెస్ట్‌ బెంగాల్‌లో కాలిపోయిన 4,000 EVM లు
🔹 కోల్‌కతా అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో EVM   లు  దహనం 
🔹  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడిన EVM గా గుర్తింపు
ఆధారాలు ఉండకూడదు అనే కుట్ర తో   షార్ట్‍ సర్క్యూట్‍ అనే టెక్నికల్‍ ను అడ్డం పెట్టుకుని  పాలకులు చేస్తున్న ఆరాచకాలే  ఈ ప్రమాదాలు 
👉 *ఉమ్మడి  ఆంద్రప్రదేష్‍ లో  ఎన్నికల సమయంలో  జరిగిన కొన్ని అగ్ని ప్రమాదాలు వాటి వివరాలు*
⭕ 1999 ఉమ్మడి ఆంద్రప్రదేష్‍ చంద్రాబాబు పాలన కాలంలో   ఎన్నికల ముందు అగ్ని  ప్రమాదం
⭕ 2004 లో  ఎన్నికల జరిగి చంద్రబాబు ప్రభుత్వం మారి YS ముఖ్యమంత్రి కాబోతున్నాడు   అనే  ఊహాలు వస్తున్న తరునం లో....... ఫలితాలకు ముందు A బ్లాక్‍ , G, బ్లాక్‍ లో అగ్ని ప్రమాదం .
⭕ 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో (ఫలితాలు వచ్చే ముందు)  ఆర్థిక  శాఖ , అటవి   శాఖ  , I T శాఖ  కు చెందిన D బ్లాక్‍ లో అగ్ని ప్రమాదాలు.
🤦‍♀️🤦‍♀️ సచివాలయం  , మంత్రుల కార్యాలయాలు EVM  స్ట్రాంగ్‍ రూములలో   జరిగినవన్ని టెక్నికల్‍  గా షార్ట్ సర్క్యూట్‍  ప్రమాదాలే కానీ ప్రయోజనం ఎవరికో అందరికి తెలుసు…. #VSK
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    9 hrs ago
  • ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్‌కు వచ్చే రైతుల శ్రేయస్సు మరియు వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన అధ్యక్షతన జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశంలో పాలకవర్గం ఈ అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు పంపాలని సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానాలు అన్నదాతలు మార్కెట్ యార్డులో ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారికి పూర్తి సౌకర్యాలు కల్పించడం కోసమే అని చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ ప్యాక్స్ (PACS) చైర్మన్ మేస్త్రం పరమేశ్వర్, జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ విఠల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్‌కు వచ్చే రైతుల శ్రేయస్సు మరియు వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన అధ్యక్షతన జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశంలో పాలకవర్గం ఈ అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు పంపాలని సమావేశం తీర్మానించింది.

ఈ తీర్మానాలు అన్నదాతలు మార్కెట్ యార్డులో ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారికి పూర్తి సౌకర్యాలు కల్పించడం కోసమే అని చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ ప్యాక్స్ (PACS) చైర్మన్ మేస్త్రం పరమేశ్వర్, జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ విఠల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    10 hrs ago
  • ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ, అలాగే SIR ప్రక్రియ ప్రారంభం కానున్న అంశాలపై చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై, SIR ప్రక్రియలో చూపించాల్సిన అప్రమత్తతపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పార్టీ సభ్యత్వాలను గ్రామ స్థాయి నుంచే నమోదు చేయాలని స్పష్టం చేశారు.
    4
    ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ, అలాగే SIR ప్రక్రియ ప్రారంభం కానున్న అంశాలపై చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై, SIR ప్రక్రియలో చూపించాల్సిన అప్రమత్తతపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పార్టీ సభ్యత్వాలను గ్రామ స్థాయి నుంచే నమోదు చేయాలని స్పష్టం చేశారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మంగళ్ళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలని ఆ గ్రామానికి చెందిన 3వ వార్డు మెంబర్ ఉప్పుల జీవరత్నం గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. తమ గ్రామానికి కోనరావుపేట మండలం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని, రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ మండలంలో గ్రామాన్ని విలీనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని జీవరత్నం అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా శుక్రవారం రోజున గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, నాయకులు స్పందించి మంగళ్ళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలని ఉప్పుల జీవరత్నం విజ్ఞప్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మంగళ్ళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలని ఆ గ్రామానికి చెందిన 3వ వార్డు మెంబర్ ఉప్పుల జీవరత్నం గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. తమ గ్రామానికి కోనరావుపేట మండలం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని, రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ మండలంలో గ్రామాన్ని విలీనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని జీవరత్నం అభిప్రాయపడ్డారు.

ఈ డిమాండ్‌కు మద్దతుగా శుక్రవారం రోజున గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, నాయకులు స్పందించి మంగళ్ళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలని ఉప్పుల జీవరత్నం విజ్ఞప్తి చేశారు.
    user_Sai
    Sai
    కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 day ago
  • లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అతి భారీ వర్షం నమోదైంది. మృగశిర కార్తె కారణంగా గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, ఆకాశం మేఘావృతమై, లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాలలో గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ భారీ వర్షం చల్లటి వాతావరణాన్ని అందించి ఆనందాన్నిచ్చింది.
    1
    లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అతి భారీ వర్షం నమోదైంది. మృగశిర కార్తె కారణంగా గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, ఆకాశం మేఘావృతమై, లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాలలో గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ భారీ వర్షం చల్లటి వాతావరణాన్ని అందించి ఆనందాన్నిచ్చింది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్ల గోడలు కూలిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో పలు ఇళ్ల గోడలు వర్షపు నీటికి తడిసి కూలిపోయాయి. అయితే, వర్షం పడుతున్న సమయంలో ఎవరూ ఇళ్లలో లేకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    1
    లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్ల గోడలు కూలిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో పలు ఇళ్ల గోడలు వర్షపు నీటికి తడిసి కూలిపోయాయి. అయితే, వర్షం పడుతున్న సమయంలో ఎవరూ ఇళ్లలో లేకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.