నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులతో వేమిరెడ్డి దంపతుల భేటీ నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులతో వేమిరెడ్డి దంపతుల భేటీ కిసాన్ సెజ్‌లో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలపై చర్చ యువతకు నైపుణ్య శిక్షణ కోసం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్: వేమిరెడ్డి దంపతులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) కిసాన్ సెజ్ ప్రతినిధులు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని వేమిరెడ్డి దంపతుల నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇఫ్కో కిసాన్ సెజ్ ఛైర్మన్ శ్రీ దిలీప్ సంఘాని, మేనేజింగ్ డైరెక్టర్ కేజే పటేల్ పాల్గొన్నారు. దిలీప్ సంఘాని, పటేల్ కి వేమిరెడ్డి దంపతులు జ్ఞాపిక అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కిసాన్ సెజ్ పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడం, నెల్లూరు జిల్లా యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో త్వరలోనే భారీ పరిశ్రమలు ప్రారంభం కాబోతుండటంతో, ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు వీపీఆర్ (VPR) ఫౌండేషన్ తరఫున త్వరలోనే ఒక ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ ద్వారా యువతకు అవసరమైన ప్రత్యేక సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణను ఉచితంగా అందించి, పరిశ్రమలలో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టరు మొగిలి వెంకటేశ్వర్లు , ఇఫ్కో సీఈఓ సుధాకర్ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులతో వేమిరెడ్డి దంపతుల భేటీ నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులతో వేమిరెడ్డి దంపతుల భేటీ కిసాన్ సెజ్‌లో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలపై చర్చ యువతకు నైపుణ్య శిక్షణ కోసం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్: వేమిరెడ్డి దంపతులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) కిసాన్ సెజ్ ప్రతినిధులు శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని వేమిరెడ్డి దంపతుల నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇఫ్కో కిసాన్ సెజ్ ఛైర్మన్ శ్రీ దిలీప్ సంఘాని, మేనేజింగ్ డైరెక్టర్ కేజే పటేల్ పాల్గొన్నారు. దిలీప్ సంఘాని, పటేల్ కి వేమిరెడ్డి దంపతులు జ్ఞాపిక అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కిసాన్
సెజ్ పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడం, నెల్లూరు జిల్లా యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో త్వరలోనే భారీ పరిశ్రమలు ప్రారంభం కాబోతుండటంతో, ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు వీపీఆర్ (VPR) ఫౌండేషన్ తరఫున త్వరలోనే ఒక ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ ద్వారా యువతకు అవసరమైన ప్రత్యేక సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణను ఉచితంగా అందించి, పరిశ్రమలలో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టరు మొగిలి వెంకటేశ్వర్లు , ఇఫ్కో సీఈఓ సుధాకర్ పాల్గొన్నారు.
- కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు ఆర్డీవో కార్యాలయంలో ధర్నా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లకు,కార్మికులకు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆవులయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు కనీస వేతనం 26,000 కల్పించి, ఆరోగ్య భీమా కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టానికైనా వెనకాడ బొమని హెచ్చరించారు.1
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1