పే స్కేల్ అమలు చేయాలి... విబిజి రాంజీ ఉద్యోగుల జిల్లా జెఎసి పే స్కేల్ అమలు చేయాలి..! ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాల కోసం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ ఉద్యోగుల ఆందోళన ఆగస్టు 15లోగా డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం.! పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా ఉపాధి హామీ (MGNREGA) ఉద్యోగులు శనివారం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. జిల్లా జేఏసీ చైర్మన్ పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇసిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకం, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ తమ భుజాలపై ఉన్నప్పటికీ, కనీస వేతన భద్రత కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల వేతనాలు ఆలస్యంగా రావడంతో కుటుంబాలను పోషించడం భారంగా మారిందని, అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల 2026 ఆగస్టు 15లోగా పే స్కేల్ అమలు చేసి, పెండింగ్ వేతనాలను విడుదల చేయడంతో పాటు ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే SRDSలో అమలవుతున్న నియామకాలపై స్పష్టత ఇవ్వాలని, సెలవు దినాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రత్యామ్నాయ సెలవులు లేదా అదనపు భత్యం కల్పించాలని, CRD కార్యాలయాల్లో ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్, క్యాజువల్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆగస్టు 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సమ్మెను విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎడ్ల ఏకాంబరం, నాయకులు బన్సీలాల్, కృష్ణ, కిరియా, రంజిత్, మాధవి, లలిత, చైతన్యతో పాటు ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు పాల్గొన్నారు.

- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1