ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కాప్రా ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ లో నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రింట్ మీడియా ప్రధాన పత్రికల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ, పాత్రికేయులు సమాజానికి అద్దం పట్టే బాధ్యతాయుతమైన వృత్తిని నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, స్థానిక ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కార దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే పనిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పాత్రికేయుల సంక్షేమం, అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ జర్నలిజం విలువలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాల్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డమీది బాలరాజు గౌడ్, కార్యదర్శి రోజా రాణి, సలహాదారులు మరియు కమిటీ ప్రతినిధులు చంద్రమౌళి, కేసీ మోహన్, క్యాసాని సత్యనారాయణ, కడియాల రమేష్, శ్రీనివాసరావు, ఉల్లోజు శ్రీనివాస్, వేముల శంకర్, సహదేవా చారి, నర్సింగ్ గౌడ్, గుమ్మడి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.2
- హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే పంటను విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.3
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- Post by Tagore1
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవీందర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరం తాలూకు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఎంతమందిని మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారో M.O డా.ఆదర్శ్ న్ను అడిగి ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయనతో పాటు సిబ్బంది వేణు గోపాల్ ఉన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా1