మెదక్ : నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్... ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన, సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని నవాబ్ పేట్ లో 14, 15 వార్డుల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ పాల్గొన్నారు. మ్యాపింగ్ 2002 లేని ఓటర్ వివరాలు డాక్యుమెంట్ సమర్పించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సమక్షంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫోటో, బంధుత్వం తదితర వివరాల్లో సవరణలు అవసరమైతే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు, బిఎల్ఓ లు, బిఎల్ఏ లు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీవో స్వామి, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, బిఎల్ ఓ లు జబిన ఫాతిమా, బుచ్చమ్మ, నీలిమ పాల్గొన్నారు.
మెదక్ : నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్... ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన, సవరణల అంశాలపై మెదక్ పట్టణంలోని నవాబ్ పేట్ లో 14, 15 వార్డుల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ పాల్గొన్నారు. మ్యాపింగ్ 2002
లేని ఓటర్ వివరాలు డాక్యుమెంట్ సమర్పించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సమక్షంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 సమర్పించాలని వారు సూచించారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫోటో, బంధుత్వం తదితర వివరాల్లో
సవరణలు అవసరమైతే ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు, బిఎల్ఓ లు, బిఎల్ఏ లు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీవో స్వామి, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, బిఎల్ ఓ లు జబిన ఫాతిమా, బుచ్చమ్మ, నీలిమ పాల్గొన్నారు.
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4