రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శభాకాంక్షలు. క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయిక రంజాన్. అల్లాహ్ దీవెనలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలి. - శుభాకాంక్షలు తెలిపిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్... ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సోదర సోదరీమణులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రంజాన్ క్రమశిక్షణ,ధాతృత్వం, ధార్మిక చింతనల కలయిక అని అన్నారు. మత సామరస్యానికి, పరస్పర సదవగాహనకు ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజులు కఠోరవ్రతం పాటించిన వారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం లభించే రోజు రంజాన్ అన్నారు.ఈ మాసం వాతావరణం అంతా పుణ్య కార్యం,దైవభీతి అనే సుగుణాలతో నిండిందన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, బీద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు..

- *మెడికవర్ లో అరుదైన ఆపరేషన్ : 5ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడిన వైద్యులు* నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో 5 ఏళ్ల బాలికకు అతి క్లిష్ఠమైన అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు వైద్యులు. శస్త్ర చికిత్స అనంతరం ఆ బాలిక పూర్తిగా కోలుకుంది. దీనిపై హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న 5 ఏళ్ల బాలికను వారి కుటుంబసభ్యులు మెడికవర్ హాస్పిటల్ కు తీసుకురాగా తమ వైద్య బృందం బాలికను పరీక్షించి, ఛాతిని స్కానింగ్ చేయడం జరిగిందన్నారు. స్కానింగ్ లో ఎడమవైపు ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగానికి సిఫార్సు చేసినట్లు డాక్టర్ కౌశిక్ రెడ్డి తెలియజేశారు. బాలికకు బ్రాంకోస్కోపి పరీక్ష నిర్వహించగా ఎడమ వైపు ఊపిరితిత్తుల్లోని మెయిన్ బ్రాంకస్ చివరలో పోక వక్కల గింజ ( బీటల్ నట్ ) పూర్తిగా పూడుకుపోయి ఉందని పేర్కొన్నారు. దీని కారణంగా బాలిక శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతుందన్నారు. ఫోగార్టీ బెలూన్ సాయంతో ఆ గింజను కదిలించి, జీరో - టిప్ బాస్కెట్ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి ఆ గింజను పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. శస్త్ర చికిత్స అనంతరం ఊపిరితిత్తి పూర్తిగా విస్తరించడంతో బాలిక తిరిగి సులభంగా శ్వాస తీసుకోగలుగుతుందని చెప్పారు. ఈ శస్త్ర చికిత్స ఎంతో క్లిష్టమైందని, గింజ గట్టిగా ఇరుక్కుపోవడంతో శ్వాస మార్గం పూర్తిగా పూడుకుపోయిందని, శస్త్ర చికిత్స ద్వారా ఊపిరితిత్తిని తిరిగి యధాతథంగా మార్చగలిగామని డాక్టర్ కౌశిక్ రెడ్డి వెల్లడించారు. చిన్నపిల్లలతో పాటూ పెద్ద వయస్సు వారికి కూడా శ్వాస కోశ సంబంధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించేందుకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటూ అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ఉదయ్ కీర్తి (పీడియాట్రిక్ ) డాక్టర్ రంగనాథ్, మెడికల్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.2
- కోవూరు ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి// TV451
- కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం. దొంగతనాలు జరక్కుండా ప్రత్యేక చర్యలు..1
- సమాచారం ఇవ్వండి చాలు.. వాళ్ళ భరతం పడతం... కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి BIBSTELUGU1
- సాంకేతిక సేవలను ప్రజలు వినియోగించుకోవాలి...కోవూరు పోలీసులు...MITHUNTVHD1
- జై భీమ్ లతో మారుమ్రోగిన బుచ్చిరెడ్డిపాలెం పట్టణం...BIBSTELUGU1
- #సంగమేశ్వర స్వామి కామాక్షమ్మ దేవస్థానము (సంగం) మనుబోలు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా1
- మనుబోలు సంఘం తిరణాల 2025. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి రథోత్సవం (తేరు).1