గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారుని కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన... బొబ్బిలి నుంచి మక్కువ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోసం వినతి. - నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరుకి సహకారం. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు గౌరవ గిరిజన శాఖ మంత్రి శ్రీమతి *గుమ్మడి సంధ్యారాణి* గారుని సాలూరులో వారి స్వగృహమందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్భంగా, *బొబ్బిలి నియోజకవర్గం నుంచి మక్కువ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు* పూర్తిగా పాడయినందున, ఆ మార్గాన ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం గౌరవ మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు.. అలానే, *నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం* శిథిలావస్థలో ఉందని, దాని అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకరించాలని కోరారు..సుమారు 10 నుంచి 15 గ్రామాల విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించవచ్చు అని మంత్రిగారుకి వివరించారు.. వీటితో పాటు, పలు సమస్యలను కూడా మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే గారు వెంట టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు గారు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీలు వెన్నెల నాగరాజు గారు మరియు శివ గారు, నాగిరెడ్డి రామారావు గారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారుని కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన... బొబ్బిలి నుంచి మక్కువ రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కోసం వినతి. - నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరుకి సహకారం. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు గౌరవ గిరిజన
శాఖ మంత్రి శ్రీమతి *గుమ్మడి సంధ్యారాణి* గారుని సాలూరులో వారి స్వగృహమందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్భంగా, *బొబ్బిలి నియోజకవర్గం నుంచి మక్కువ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు* పూర్తిగా పాడయినందున, ఆ మార్గాన ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం గౌరవ మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి
సహకారం అందించాలని కోరారు.. అలానే, *నిమ్మలపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహం* శిథిలావస్థలో ఉందని, దాని అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకరించాలని కోరారు..సుమారు 10 నుంచి 15 గ్రామాల విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించవచ్చు అని మంత్రిగారుకి వివరించారు.. వీటితో పాటు, పలు సమస్యలను కూడా మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లి
వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే గారు వెంట టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు గారు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీలు వెన్నెల నాగరాజు గారు మరియు శివ గారు, నాగిరెడ్డి రామారావు గారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు1
- విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.1
- రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.2
- పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.1
- విజయనగరం: ధరలు పెరుగుదల నియంత్రించాలి ంచాలి: స్పెషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్.. విజయనగరం జిల్లా నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల ప్రభుత్వం, అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయనగరంలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.1