డైట్ లెక్చరర్‌గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు రెడ్డికి ఘన సన్మానం పీలేరు, జనవరి 8: గురువారం పీలేరు మండలంలోని ఎనుములవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న శ్రీనివాసులు రెడ్డి డైట్ లెక్చరర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా పాఠశాలలో ఘనంగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాసులు రెడ్డి పాఠశాలకు చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించడంలో, పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించడంలో ఆయనది విశేష పాత్ర అని తెలిపారు. క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన బోధనతో పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన పదోన్నతి పాఠశాలకే కాదు, మొత్తం విద్యారంగానికి గర్వకారణమన్నారు. అనంతరం పాఠశాల బోధనా సిబ్బంది శ్రీనివాసులు రెడ్డి సేవలను ప్రశంసిస్తూ ప్రసంగించారు. గణిత ఉపాధ్యాయులు కె.రమేష్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులు శ్రీధర్ బాబు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఉదయశ్రీ, తెలుగు ఉపాధ్యాయులు ఎల్. సుభద్రమ్మ, హిందీ ఉపాధ్యాయులు వెంకటరమణ, వ్యాయామ ఉపాధ్యాయులు నుస్ రత్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు జాహ్నవి, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పుష్ప, సెల్వి, రెడ్డప్ప తదితరులు మాట్లాడుతూ, శ్రీనివాసులు రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసిన ఉత్తమ ఉపాధ్యాయుడని తెలిపారు. ఆయన పనితనం, సహచరులతో మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఎనిమల వారి పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి. వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో, పాఠశాల సిబ్బందితో కలిసి పని చేయడం తన అదృష్టమని అన్నారు. సహచరుల సహకారం, ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు వినయం, విధేయతలతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

- వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు పీలేరు జనవరి 8 : స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు. చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.1
- ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- Post by Bondhu Suresh1
- మండల సర్వేయర్ పై పోలీసులకు ఫిర్యాదు. పలమనేరు జనవరి 9 (ప్రజా ప్రతిభ) : అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయకుండానే చేసినట్లు తప్పుడు ఎండార్స్ ఇచ్చిన గంగవరం మండల సర్వేర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలమనేర్ నియోజకవర్గం అంబేద్కర్ భవనాల అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం గంగవరం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం, ఎం. శ్రీనివాసులు,మణి, మహేష్, రెడ్డి ప్రసాద్, హరి మాట్లాడుతూ నెల రోజుల క్రితం అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన శ్రీలంక శరణార్థులకు అంబేద్కర్ వాదులకు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు విన్నవించామన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో16--12---25 వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 6వ తేదీ వివాదంలో ఉన్న అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయడానికి వస్తున్నామని వాట్సాప్ ద్వారా మండల సర్వేర్ నోటీసు పంపించారని వివరించారు. ఆరోజు సాయంత్రం వరకు దళిత, బహుజన నాయకులు అధికారులు వస్తారని పడిగాపులు కాసినా ఎవరు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగామన్నారు. ఇప్పటివరకు సర్వేనెంబర్ 314 స్థలం సబ్ డివిజన్ కాకపోయినా మండల సర్వే314/3 గా సబ్ డివిజన్ అయినట్లు క్రియేట్ చేసి మాకు పంపిన ఎండార్స్ లో పంపారని ఆరోపించారు. 31----12---2025 వతేది మేము పి జి ఆర్ ఎస్ లో నమోదు చేసుకొన్న ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా తప్పుడు ఎండార్స్ ఇచ్చి అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. దళితులు పట్ల అధికారులకు, అగ్రవర్ణాలకు వివక్ష ఉన్నదనే విషయం నగ్నమెరిగిన సత్యం అని ,అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశం పొందిన అధికారులు కూడా అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయములో వివక్ష చూపుతూ తప్పుడు సమాచారం ఇవ్వడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మండల సర్వేయర్ దళితులు పట్ల చూపుతున్న వ్యవహార శైలిని ఎండగడుతూ అతనిపైన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరారు, ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు1
- PPP విధానం ఆపండి1
- చిత్తూరు... సెంటర్... పలమనేరు ... బైరెడ్డిపల్లి మండలo బైరెడ్డిపల్లి లో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్ ... 16 కేజీల గంజాయి స్వాధీనం ... నాయుడుపేట to పలమనేర్ కు గంజాయి సప్లై చేసిన స్మగ్లర్ ... స్మగ్లర్ నుండి ఇతర మండలాల విక్రయదారులకు చేరుకుంటున్న గంజాయి ... ప్రధాన స్మగ్లర్లు పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తాం అంటున్న పోలీసులు ... వినియోగదారులకు సైతం పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తాం1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1