Shuru
Apke Nagar Ki App…
నూతన వరుడు ని ఆశీర్వదించిన రాజేశ్వరమ్మ..lవాసు ఫంక్షన్ హాల్‌లో *నూతన వరుడు ని ఆశీర్వదించిన రాజేశ్వరమ్మ...* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, వాడ్రేవుపల్లిలోని వాసు ఫంక్షన్ హాల్‌లో జరిగిన ముఖరం హుస్సేన్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు, ఆమెతో పాటు ఆమె తనయుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాష్ పాముల గారు ఈ వేడుకకు విచ్చేసి నూతన వరుడు ని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో సజ్జాధ్ హుస్సేన్, కడలి శ్రీను, చింత ప్రసాద్, ముఖరం హుస్సేన్, తాయిర్ హుస్సేన్ మరియు ఇతర ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.*
SS NEWS
నూతన వరుడు ని ఆశీర్వదించిన రాజేశ్వరమ్మ..lవాసు ఫంక్షన్ హాల్‌లో *నూతన వరుడు ని ఆశీర్వదించిన రాజేశ్వరమ్మ...* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, వాడ్రేవుపల్లిలోని వాసు ఫంక్షన్ హాల్‌లో జరిగిన ముఖరం హుస్సేన్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు, ఆమెతో పాటు ఆమె తనయుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాష్ పాముల గారు ఈ వేడుకకు విచ్చేసి నూతన వరుడు ని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో సజ్జాధ్ హుస్సేన్, కడలి శ్రీను, చింత ప్రసాద్, ముఖరం హుస్సేన్, తాయిర్ హుస్సేన్ మరియు ఇతర ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.*
More news from Kakinada and nearby areas
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- manasuloni mata1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3