Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2024 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ అధికారులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ (మలేరియా), మహిళా నర్సింగ్ హెల్పర్ మరియు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేటగిరీలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అయ్యాయి.
SS NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2024 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ అధికారులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ (మలేరియా), మహిళా నర్సింగ్ హెల్పర్ మరియు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేటగిరీలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అయ్యాయి.
More news from Konaseema and nearby areas
- 🙏🙏1
- 🙏🙏1
- 😭🙏1
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.1
- కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ ఆలయంలో ఆదివారం నాడు భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో సుమారుగా 32 వేల మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొర్ల భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజుతో కలిసి క్యూ లైన్లలో నిలబడిన భక్తుల వద్దకు వెళ్లి ఆలయంలో కల్పించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రాకతో ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. వాహన పూజలు, ప్రసాదాలు, రూములు, కేశఖండన మరియు వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 12,13,758 (12 లక్షల 13 వేల 758) ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు వెల్లడించారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ప్రేమ, ఓర్పుతో వ్యవహరించాలని, ఆటలు, పాటల ద్వారా బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, పిల్లల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.2
- 🙏🙏1
- ఓటర్లకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) ను జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన ఫారమ్‌ను మీ ప్రాంత బీఎల్‌ఓ (BLO) కు అందజేయాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా దీనిని సమర్పించకపోతే, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫారమ్ అందనట్లయితే, ఈసీఐ (ECI) ఓటర్ పోర్టల్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. లేదా మీ పరిధిలోని బీఎల్‌ఓను సంప్రదించి కూడా ఫారమ్ పొందవచ్చు. మీ ఓటు భద్రంగా ఉండాలంటే జూలై 14 లోపు ఈ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను సమర్పించడం తప్పనిసరి.1