తేదీ: 06.12.2025 *ప్రెస్ నోట్* *బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్!* సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానంపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ, ఈ రోజు (డిసెంబర్ 6, 2025) సంగారెడ్డి ఐబీలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ, సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదాన ఘటన తీవ్ర బాధాకరం, ఇటువంటివి పునరావృతం కాకూడదు అని పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ–బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం సమాజానికి ఎంతో బాధాకరం అన్నారు. బలిదానాలు కాదు – పోరాటమే మార్గం! నేతలు ఈ సందర్భంగా కింది డిమాండ్లు మరియు సందేశాలను ఉద్ఘాటించారు: న్యాయబద్ధమైన రిజర్వేషన్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, జనాభా సంఖ్య ప్రాతిపదికన బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బలిదానాలు ఆపండి: తెలంగాణ సాధనలో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన బిడ్డలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేస్తూ, "ఇక చాలు. ఇక నుంచి బలిదానాలు కాదు, పోరాటమే మార్గం" అని స్పష్టం చేశారు. రాజకీయ చైతన్యం: మన హక్కులు, రిజర్వేషన్లు, గౌరవం ఆత్మహత్యలతో రావు. ఐక్యత, స్ఫూర్తి, రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఓటు ద్వారా సమాధానం: మనకు మోసం చేసినవారికి ఎన్నికల్లో ఓటు ద్వారానే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పోరాటం యొక్క మార్గం: "మన హక్కుల కోసం మనం వేడుకోవటం కాదు, పోరాటం ద్వారా సాధించుకుందం. అది మన ప్రాణ త్యాగాల ద్వారా కాదు, మన రాజకీయ సంకల్పం మరియు నిస్వార్థ పోరాటం ద్వారా." లక్ష్యం: 'హిస్సా' (వాటా), 'ఇజ్జత్' (గౌరవం), 'హుకుమత్' (పాలన) ల కోసం అందరం కలిసి పోరాడుదాం. అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం. మన మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడిచి మన ఆశయాన్ని సాధిద్దామని బీసీ జేఏసీ నాయకులు ప్రతిన బూనారు. చివరిగా హెచ్చరిక: "ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయకండి. ప్రాణం విలువైనది—పోతే తిరిగి రాదు. పోరాటం పవిత్రమైనది—కానీ ఆత్మబలిదానం దానికి మార్గం కాదు." తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు— పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలని ఆకాంక్షించారు. ఈ సంస్మరణ సభలో బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్, సలహాదారు వై. అశోక్ కుమార్, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, చంద్రయ స్వామి కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్, , కో కన్వీనర్ లు మంగ గౌడ్ నాగరాని, మంగ గౌడ్ ఆర్ లక్ష్మి, మానస,.మీడియా ప్రతినిధి మహేష్ కుమార్,విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి బాషా, జే ఏ సి నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, సుధాకర్, నాగభూషణం నాయి వీరన్న, విట్టల్, రాములు డి బహుజన నేతలు వేణు పాండు, మల్లేశం, సుమన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తేదీ: 06.12.2025 *ప్రెస్ నోట్* *బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్!* సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయనే తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానంపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ, ఈ రోజు (డిసెంబర్ 6, 2025) సంగారెడ్డి ఐబీలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ, సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదాన ఘటన తీవ్ర బాధాకరం, ఇటువంటివి పునరావృతం కాకూడదు అని పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ–బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం సమాజానికి ఎంతో బాధాకరం అన్నారు. బలిదానాలు కాదు – పోరాటమే మార్గం! నేతలు ఈ సందర్భంగా కింది డిమాండ్లు మరియు సందేశాలను ఉద్ఘాటించారు: న్యాయబద్ధమైన రిజర్వేషన్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, జనాభా సంఖ్య ప్రాతిపదికన బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లను చట్టబద్ధంగా
అమలు చేయాలని డిమాండ్ చేశారు. బలిదానాలు ఆపండి: తెలంగాణ సాధనలో 12 వందల మందికి పైగా బీసీ, బహుజన బిడ్డలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేస్తూ, "ఇక చాలు. ఇక నుంచి బలిదానాలు కాదు, పోరాటమే మార్గం" అని స్పష్టం చేశారు. రాజకీయ చైతన్యం: మన హక్కులు, రిజర్వేషన్లు, గౌరవం ఆత్మహత్యలతో రావు. ఐక్యత, స్ఫూర్తి, రాజకీయ చైతన్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఓటు ద్వారా సమాధానం: మనకు మోసం చేసినవారికి ఎన్నికల్లో ఓటు ద్వారానే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పోరాటం యొక్క మార్గం: "మన హక్కుల కోసం మనం వేడుకోవటం కాదు, పోరాటం ద్వారా సాధించుకుందం. అది మన ప్రాణ త్యాగాల ద్వారా కాదు, మన రాజకీయ సంకల్పం మరియు నిస్వార్థ పోరాటం ద్వారా." లక్ష్యం: 'హిస్సా' (వాటా), 'ఇజ్జత్' (గౌరవం), 'హుకుమత్' (పాలన) ల కోసం అందరం కలిసి పోరాడుదాం. అధిపత్య కులాల దోపిడీకి ఘోరీ కట్టుదాం. మన మహనీయులు ఫూలే, అంబేడ్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడిచి మన ఆశయాన్ని సాధిద్దామని బీసీ జేఏసీ నాయకులు
ప్రతిన బూనారు. చివరిగా హెచ్చరిక: "ఈ సంఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. ఇకపై ఎవరూ ఇలాంటి చర్యలు చేయకండి. ప్రాణం విలువైనది—పోతే తిరిగి రాదు. పోరాటం పవిత్రమైనది—కానీ ఆత్మబలిదానం దానికి మార్గం కాదు." తెలంగాణ మళ్లీ బలిదానాల గడ్డ కాకూడదు— పాలన, గౌరవం, న్యాయం, హక్కుల అడ్డా కావాలని ఆకాంక్షించారు. ఈ సంస్మరణ సభలో బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్, సలహాదారు వై. అశోక్ కుమార్, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, చంద్రయ స్వామి కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్, , కో కన్వీనర్ లు మంగ గౌడ్ నాగరాని, మంగ గౌడ్ ఆర్ లక్ష్మి, మానస,.మీడియా ప్రతినిధి మహేష్ కుమార్,విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి బాషా, జే ఏ సి నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, సుధాకర్, నాగభూషణం నాయి వీరన్న, విట్టల్, రాములు డి బహుజన నేతలు వేణు పాండు, మల్లేశం, సుమన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- Post by KLakshmi Devi1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్1