మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి
వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు,
నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.1
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- రేలమడుగు కళ్ళు దుకాణంలో బొమ్మ బోరుసు ఆడుతున్న 9 మంది అరెస్ట్ 7910 రూపాయలు నగదు స్వాధీనం ఆర్ సెల్ ఫోన్లు సీజ్ ఎస్పి శ్రీనివాసరావు బొమ్మా బొరుసు ఆడుతున్న 9 మంది అరెస్టు రూ.7,910 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మా బొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శేఖర్, యాదగిరి, చంద్రశేఖర్, ప్రవీణ్, చంద్రం, కిష్టయ్య, పోలె లక్ష్మణ్, దుర్గేష్, నిఖిల్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, జూదం, పేకాట, బొమ్మా బొరుసు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత జూదం, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.1