బాన్సువాడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజలు కట్టిన పనులతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో ఇచ్చే రేషన్ బియ్యాన్ని. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రచారం చేసుకునేలా ఒక బ్యాగు విడుదల చేసి తెలంగాణ ప్రజలకు రేషన్ షాపుల్లో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని. అందిస్తున్న బిజెపి ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. .ప్రజలకు.మభ్య పెట్టే విధంగా. పూర్తి రేషన్ బియ్యం మేము చేస్తున్నామని. చెప్పుకోవడం సిగ్గుచేటు. బాన్సువాడ బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు. గుడుగుట్ల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని. కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల డబ్బు వృధా చేస్తూ. తమ పార్టీ ప్రచారం కోసం ప్రజల డబ్బు వృధా. చేస్తుంది ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్ బాన్సువాడ బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు.
బాన్సువాడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజలు కట్టిన పనులతో. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో ఇచ్చే రేషన్ బియ్యాన్ని. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రచారం చేసుకునేలా ఒక బ్యాగు విడుదల చేసి తెలంగాణ ప్రజలకు రేషన్ షాపుల్లో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని. అందిస్తున్న బిజెపి ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. .ప్రజలకు.మభ్య పెట్టే విధంగా. పూర్తి రేషన్ బియ్యం మేము చేస్తున్నామని. చెప్పుకోవడం సిగ్గుచేటు. బాన్సువాడ బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు. గుడుగుట్ల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని. కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల డబ్బు వృధా చేస్తూ. తమ పార్టీ ప్రచారం కోసం ప్రజల డబ్బు వృధా. చేస్తుంది ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్ బాన్సువాడ బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.93,52,748/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం – 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి – 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , శ్రీ రాజమౌళి (కరీంనగర్ ఏసీఆఫీస్) , పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ కార్య నిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు.1
- పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.1
- Post by Solanke Ravi4
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. బీర్కూర్, డోంగ్లి, కామారెడ్డి, లింగంపేట, మద్నూర్ తదితర మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. విద్యుత్కు సైతం అంతరాయం కలగగా రోజూ పనులు చేసుకునే వారు ఓ పక్క ఇబ్బందులు పడుతుంటే.. ఎండాకాలంలోనూ వానాకాలాన్ని తలపించేలా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కాగా కోత దశకు వచ్చిన వారి జొన్న మొక్కజొన్న కుసుమ పంటలు ఈ అకాల వర్షంతో దెబ్బతిని అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ మండలంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలతో జొన్న పంట నేలకొరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో జొన్న పంట చేతి దశకు రావడంతో పంట కల్లాలు చేస్తున్నారు. దీంతో అకాల వర్షాలతో పంట నల్లగా రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలో 2,600 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అలాగే ప్రభుత్వం ఎలాగైనా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేండ్లకుపైగా పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు.సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi3