మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు: హెచ్ ఆర్ మోహన్, (మేడ్చల్ జిల్లా, నాచారం ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వ్యతిరేకించారని బిజెపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికార ప్రతినిధి హెచ్.ఆర్ మోహన్ మండిపడ్డారు. ఈ మేరకు నాచారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక పవనాలు రావాలని మహిళల్లో వ్యతిరేకత తీసుకురావాలని బీజేపీ పార్టీ గత రెండు, మూడు రోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును అధికారికంగా అసలు ప్రవేశ పెట్టలేదని అన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినం అని చెబుతున్న రోజు మూడు బిల్లులు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఇలా మూడు బిల్లులు పెట్టారని అందులో మహిళా బిల్లు లేదన్నారు. అసలు మహిళ రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ లోనే పాస్ అయి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడిందని అన్నారు. కానీ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు జనగణన జరిగిన తర్వాతనే అమలులోకి వస్తుందని బిల్లులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. మొదట జనగణన చేయాలని జనగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదన్నారు. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం బిల్లు పెడితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తప్పు బిజెపి పక్షాన పెట్టుకొని మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టడానికి బిజెపి నాయకులకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో మహిళలు రాజకీయంగా రాణిస్తున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రిజర్వేషన్లే కారణమన్నారు. బిజెపి పార్టీ మహిళల కోసం ఏమి చేస్తుందో చెప్పాలని బిజెపి పార్టీలో మహిళలకు అసలు ప్రాధాన్యత ఉందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విభజన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేనియెడల తెలంగాణ ప్రజలు బిజెపి నాయకులను రోడ్లమీద తిరగనీయరు అని హెచ్చరించారు. కార్యక్రమంలో టిపిసిసి లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు విఎస్ ప్రకాష్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి పాల్గొన్నారు.

- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- Post by Tagore1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1