Shuru
Apke Nagar Ki App…
మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లిలో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం పట్టువస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Nagesh Kothapalli
మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్‌పల్లిలో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం పట్టువస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
More news from Telangana and nearby areas
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- నల్గొండలో చికెన్ ధరలు అమాంతం పెరిగి రూ.330 దాటాయి, మటన్ ధరలను చేరువవుతున్నాయి. వేసవిలో కోళ్ల దిగుమతి తగ్గడంతో ఈ ధరల పెరుగుదల సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు.1