సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధించాలంటే రాజ్యాధికారం సాధన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళి. -జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ . బద్వేలు, ఏప్రిల్ 14:అంటరానితనం, అణచివేత, వివక్షత లేని సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధించాలంటే అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు ఐక్యంగా పోరాడి సాధించుకున్నప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పి పి కుంట ఏబీ బర్ధన్ కాలనీ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర డాక్టర్ అంబేద్కర్ నగర్ లో రామ్‌జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించిన డా బి. ఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచే కుల వివక్ష, అంటరానితనం ముంబైలోని చదువును ప్రారంభించి అమెరికాలోని,ఇంగ్లాండ్‌లోని ఉన్నత విద్య, న్యాయవాదిగా ఉత్తీర్ణులై అంది వచ్చిన అవకాశాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా తను నమ్మిన సిద్ధాంతం అణగారిన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. అంటరానితనం, వివక్షత, అణచివేతలకు కారణమైన హిందూ మతం అనుసరించే మనువాద సిద్ధాంతం, చాతురు వర్ణ వ్యవస్థ మనుషులు మనుషులుగా చూడని, మనుషులను విడదీసే మనువాదాన్ని వ్యతిరేకించి, ప్రతులను దగ్ధం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. గుడి, బడి, కూడు, గూడు, గుడ్డ, గౌరవం ఇవ్వకుండా వివక్షతను అంతర్భాగం చేసిన హిందూ మతం అణగారిన వర్గాలు విడనాడాలని సామాజిక న్యాయం సమానత్వం కల్పించే మతంలోకి మారాలని పిలుపునిచ్చిన సామాజిక విప్లవకారుడు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కుల మత ప్రాంత భాష సాంస్కృతి వర్ణ జాతి లింగ వివక్షత లేని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. వివక్షత, హిందుత్వ వాదానికి వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న దళితుల రాజ్యాధికారం నెరవేరడం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు ఆలోచనలకు భిన్నంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి, సంఘ్ పరివార్ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో ప్రజల మధ్య వైశ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని, అంబేద్కర్ పై అవాకులు చవాకులు పేలుతూ, అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయిపై దాడి చేసి, స్వతంత్ర సంస్థలన్నిటిని సంపరివార చేతుల్లో పెట్టుకొని నిరంకుశంగా వ్యవహరిస్తూ సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి సంపద సృష్టించే శ్రామిక జనం అణగారిన వర్గాలను కట్టు బానిసలుగా చేసుకొని దోపిడీకి ద్వారాలు తెరిచే విధంగా చట్టాలను మార్పులు చేశారన్నారు. మనసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ జయంతి నాడు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నేతలు నిస్సిగ్గుగా నివాళులర్పిస్తూ అంబేద్కర్ ఆలోచనలకు, ఆయన రచించిన రాజ్యాంగానికి సమాధి చేయాలని చూస్తున్నారని వారి ఆరోపించారు. అంబేద్కర్ కలలు గన్న దళితులు విద్యావంతులు కావాలని, ఉన్నత చదువులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్నత పదవులు పొందాలని జనాభా ప్రాతిపదికన ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాల్లో సమానంగా పంపిణీ జరగాలని జనగణనలో కులగనను ఆర్థిక రాజకీయ సామాజిక కోణాలలో సర్వే జరగాలని అంటరానితనం వివక్షత నుండి విముక్తి కోసం మతం మారిన దళితులకు రిజర్వేషన్ రద్దు చేసే ఆలోచనకు స్వస్తి పలకాలని, మనువాద రాజకీయాలకు సమాధి కట్టేందుకు సమైక్యంగా సమరసిల పోరాటాలకు శ్రీకారం చుట్టడమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శులు పివి రమణ ఇమ్మానియేల్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పొంగూరు నాగరాజు ,విజయమ్మ, ఏరియా కార్యవర్గ సభ్యులు సనమాల చెన్నయ్య , శాఖ కార్యదర్శులు వెంకటయ్య ,ఓబులేసు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఖాదర్ బాషా ,కమిటీ సభ్యులు గురయ్యా ,లక్ష్మమ్మ ,ఓబులమ్మ ,సుప్రజ, సుబ్బరాయుడు, రాజేష్, ఓబుళపతి ,భాష పాల్గొన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధించాలంటే రాజ్యాధికారం సాధన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళి. -జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ . బద్వేలు, ఏప్రిల్ 14:అంటరానితనం, అణచివేత, వివక్షత లేని సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధించాలంటే అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు ఐక్యంగా పోరాడి సాధించుకున్నప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం పి పి కుంట ఏబీ బర్ధన్ కాలనీ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర డాక్టర్ అంబేద్కర్ నగర్ లో రామ్‌జీ సక్పాల్, భీమాబాయి దంపతులకు జన్మించిన డా బి. ఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచే కుల వివక్ష, అంటరానితనం ముంబైలోని చదువును ప్రారంభించి అమెరికాలోని,ఇంగ్లాండ్‌లోని ఉన్నత విద్య, న్యాయవాదిగా ఉత్తీర్ణులై అంది వచ్చిన అవకాశాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా తను నమ్మిన సిద్ధాంతం అణగారిన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని లక్ష్యం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. అంటరానితనం, వివక్షత, అణచివేతలకు కారణమైన హిందూ మతం అనుసరించే మనువాద సిద్ధాంతం, చాతురు వర్ణ వ్యవస్థ మనుషులు మనుషులుగా చూడని, మనుషులను విడదీసే మనువాదాన్ని వ్యతిరేకించి, ప్రతులను దగ్ధం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. గుడి, బడి, కూడు, గూడు, గుడ్డ, గౌరవం ఇవ్వకుండా వివక్షతను అంతర్భాగం చేసిన హిందూ మతం అణగారిన వర్గాలు విడనాడాలని సామాజిక న్యాయం సమానత్వం కల్పించే మతంలోకి మారాలని పిలుపునిచ్చిన సామాజిక విప్లవకారుడు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కుల మత ప్రాంత భాష సాంస్కృతి వర్ణ జాతి లింగ వివక్షత లేని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. వివక్షత, హిందుత్వ వాదానికి వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న దళితుల రాజ్యాధికారం నెరవేరడం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు. అంబేద్కర్
ఆశయాలకు ఆలోచనలకు భిన్నంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి, సంఘ్ పరివార్ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో ప్రజల మధ్య వైశ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని, అంబేద్కర్ పై అవాకులు చవాకులు పేలుతూ, అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయిపై దాడి చేసి, స్వతంత్ర సంస్థలన్నిటిని సంపరివార చేతుల్లో పెట్టుకొని నిరంకుశంగా వ్యవహరిస్తూ సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి సంపద సృష్టించే శ్రామిక జనం అణగారిన వర్గాలను కట్టు బానిసలుగా చేసుకొని దోపిడీకి ద్వారాలు తెరిచే విధంగా చట్టాలను మార్పులు చేశారన్నారు. మనసు నిండా మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ జయంతి నాడు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నేతలు నిస్సిగ్గుగా నివాళులర్పిస్తూ అంబేద్కర్ ఆలోచనలకు, ఆయన రచించిన రాజ్యాంగానికి సమాధి చేయాలని చూస్తున్నారని వారి ఆరోపించారు. అంబేద్కర్ కలలు గన్న దళితులు విద్యావంతులు కావాలని, ఉన్నత చదువులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్నత పదవులు పొందాలని జనాభా ప్రాతిపదికన ఆర్థిక రాజకీయ సామాజిక అవకాశాల్లో సమానంగా పంపిణీ జరగాలని జనగణనలో కులగనను ఆర్థిక రాజకీయ సామాజిక కోణాలలో సర్వే జరగాలని అంటరానితనం వివక్షత నుండి విముక్తి కోసం మతం మారిన దళితులకు రిజర్వేషన్ రద్దు చేసే ఆలోచనకు స్వస్తి పలకాలని, మనువాద రాజకీయాలకు సమాధి కట్టేందుకు సమైక్యంగా సమరసిల పోరాటాలకు శ్రీకారం చుట్టడమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శులు పివి రమణ ఇమ్మానియేల్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పొంగూరు నాగరాజు ,విజయమ్మ, ఏరియా కార్యవర్గ సభ్యులు సనమాల చెన్నయ్య , శాఖ కార్యదర్శులు వెంకటయ్య ,ఓబులేసు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఖాదర్ బాషా ,కమిటీ సభ్యులు గురయ్యా ,లక్ష్మమ్మ ,ఓబులమ్మ ,సుప్రజ, సుబ్బరాయుడు, రాజేష్, ఓబుళపతి ,భాష పాల్గొన్నారు.
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్‌కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్‌కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- Post by Palakattu nagendra1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- Post by Bondhu Suresh1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.1