Shuru
Apke Nagar Ki App…
జనగామలో ఉరుములు–మెరుపులతో భారీ వర్షం: పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి జనజీవనం అతలాకుతలమవగా, పలు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, చింతకాయలు రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఎండల నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడినప్పటికీ, ప్రకృతి ప్రకోపంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
M D Azizuddin
జనగామలో ఉరుములు–మెరుపులతో భారీ వర్షం: పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి జనజీవనం అతలాకుతలమవగా, పలు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, చింతకాయలు రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఎండల నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడినప్పటికీ, ప్రకృతి ప్రకోపంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో3
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1