👉రబి లో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలి. 👉3 నెలలకు ఒకసారి బోర్డు సమావేశం తప్పకుండా జరగాలి. 👉ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. 👉ఇరిగేషన్ పనులు ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలి. 👉రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇరిగేషన్ అధికారులకు ఆదేశం. శ్రీకాకుళం,డిశంబరు,6: రబీలో వరి పంట తప్ప వేరుశనగ, ఇతర పంటలను రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులను కోరారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులను కోరారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసన సభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలన్నారు. సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్యలు గుర్తించి సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గండీలు గుర్తించాలని మంత్రి ఆదేశించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను నీటి సంఘాల ఛైర్మన్లు కోరారు. హిరమండలం రిజర్వాయర్ లో అందుబాటులో ఉన్న నీటి వివరాలను ఎస్ఈ వివరించగా ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రభీలో వరి పంట మినహా వేరుశనగ, తదితర పంటలు వేసుకోవాలని, రైతులు గమనించాలని మంత్రి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడమైనదని, ప్రాజెక్టు ఛైర్మన్ లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రబీ పంటల పై రైతులకు అవగాహన చేయాలన్నారు. ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులో ఉన్న నీరు కాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజి పాడైనందు వలన బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ నాగావళి, వంశధార, నారాయణపురం బ్యారేజీల నుండి అందిస్తున్న నీటి వివరాలను వివరించారు. కాట్రగడ సైడ్ వివర్ నుండి రావలసిన నీరు తక్కువ వస్తుందని, అందులో ఉన్న పూడిక తీస్తే మరింత నీరు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏవిధంగా ఉందో తెలియజేయాలన్నారు. తోటపల్లి లైనింగ్ పనులు, ఆఫ్షోర్, మహేంద్రతనయ, వంశధార రెండవ దశ పనులను గుర్తించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ పనుల పై తీసుకున్న నిర్ణయాలను, జిల్లా నుండి ఏ ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో ముందుగానే తెలియజేస్తే సంబంధిత మంత్రితో మాట్లాడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వంశధార స్టేజ్-2 భూసేకరణకు సంబంధించి 28 ఎకరాలకు నష్ట పరిహారం ఎంత ఇవ్వాలో అప్ లోడ్ చేయాలని, వంద మంది రైతులు ఉన్నట్లు డిఈ మంత్రికి వివరించారు. నాగావళి, వంశధార అనుసంధానం పై చర్చించారు. ఈ యేడాది ఖరీఫ్ కు సాగునీరు త్వరగా విడుదల చేసినప్పటికీ గండీలు మూడు సార్లు పడ్డాయని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్ననాడే సాగునీరు సవ్యంగా సాగుతోందన్నారు. శివారు భూములకు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. నీటి సంఘాల సభ్యులు వారి పరిధిలో ఉన్న సాగునీటి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శాసన సభ్యులు కూన రవి కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగు నీరు, చెత్త సాగునీటి కాలువల్లోకి రాకుండా చూడాలని, దానికోసం ఒక సొల్యూషన్ ఉందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పైన చర్చించారు. వంశధార కుడి, ఎడమ కాలువల పై చర్చించారు. ఎల్ఎంసి, ఆర్ఎంసిలలో ఉన్న పనులను గుర్తించి అంచనాలు తయారు చేసి సంబంధిత శాసన సభ్యులకు తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. సైడ్ వీవర్, లిఫ్ట్ ఇరిగేషన్, వంశధార ఫేజ్-2 పనులపై అంచనాలు తయారు చేసి సంబంధిత శాసన సభ్యులకు తెలియజేయాలని ఆదేశించారు. పలాస శాసన సభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ ఆఫ్షోర్ రిజర్వాయర్ పై ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేపడుతున్న పనులపై సమీక్షిస్తే పురోగతి తెలిస్తోందన్నారు. ఆఫ్షోర్ పనులకు సంబంధించి నెలకో పని చొప్పున లక్ష్యం పెట్టుకుంటే ప్రతీ నెల సమీక్ష కోసం అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలు ఉంటే పరిష్కారం చేయవచ్చన్నారు. హైలెవల్ కెనాకు సంబంధించి వివరాలను శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా హైలెవల్ కెనాకు సంబంధించి భూ సేకరణ పూర్తి అయిందని నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. నారాయణపురం ఆనకట్ట కు ఫీల్డ్ ఛానల్స్ వద్ద షట్టర్లు లేవని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పగా షట్టర్లు ఉంటే శివారు భూములకు సాగునీరు వెలుతుందని, షట్టర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం కావాలని మంత్రి ఆదేశించారు. ఫ్లెడ్ బాంక్స్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు కూన రవి కుమార్, పలాస శాసన సభ్యులు గౌతు శిరీష, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ ఎ. రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్టు ఛైర్మన్ సనపల డిల్లీరావు, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, వంశధార డిప్యూటీ కలెక్టర్ జి. జయదేవి, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, ఈఈలు, నీటి సంఘాల ఛైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
👉రబి లో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలి. 👉3 నెలలకు ఒకసారి బోర్డు సమావేశం తప్పకుండా జరగాలి. 👉ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. 👉ఇరిగేషన్ పనులు ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేయాలి. 👉రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇరిగేషన్ అధికారులకు ఆదేశం. శ్రీకాకుళం,డిశంబరు,6: రబీలో వరి పంట తప్ప వేరుశనగ, ఇతర పంటలను రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులను కోరారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులను కోరారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసన సభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలన్నారు. సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్యలు గుర్తించి సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గండీలు గుర్తించాలని మంత్రి ఆదేశించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను నీటి సంఘాల ఛైర్మన్లు కోరారు. హిరమండలం రిజర్వాయర్ లో అందుబాటులో ఉన్న నీటి వివరాలను ఎస్ఈ వివరించగా
ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రభీలో వరి పంట మినహా వేరుశనగ, తదితర పంటలు వేసుకోవాలని, రైతులు గమనించాలని మంత్రి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడమైనదని, ప్రాజెక్టు ఛైర్మన్ లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రబీ పంటల పై రైతులకు అవగాహన చేయాలన్నారు. ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులో ఉన్న నీరు కాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజి పాడైనందు వలన బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ నాగావళి, వంశధార, నారాయణపురం బ్యారేజీల నుండి అందిస్తున్న నీటి వివరాలను వివరించారు. కాట్రగడ సైడ్ వివర్ నుండి రావలసిన నీరు తక్కువ వస్తుందని, అందులో ఉన్న పూడిక తీస్తే మరింత నీరు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏవిధంగా ఉందో తెలియజేయాలన్నారు. తోటపల్లి లైనింగ్ పనులు, ఆఫ్షోర్, మహేంద్రతనయ, వంశధార రెండవ దశ పనులను గుర్తించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ పనుల పై తీసుకున్న నిర్ణయాలను, జిల్లా నుండి ఏ ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో ముందుగానే తెలియజేస్తే సంబంధిత మంత్రితో మాట్లాడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వంశధార స్టేజ్-2 భూసేకరణకు సంబంధించి 28
ఎకరాలకు నష్ట పరిహారం ఎంత ఇవ్వాలో అప్ లోడ్ చేయాలని, వంద మంది రైతులు ఉన్నట్లు డిఈ మంత్రికి వివరించారు. నాగావళి, వంశధార అనుసంధానం పై చర్చించారు. ఈ యేడాది ఖరీఫ్ కు సాగునీరు త్వరగా విడుదల చేసినప్పటికీ గండీలు మూడు సార్లు పడ్డాయని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్ననాడే సాగునీరు సవ్యంగా సాగుతోందన్నారు. శివారు భూములకు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. నీటి సంఘాల సభ్యులు వారి పరిధిలో ఉన్న సాగునీటి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శాసన సభ్యులు కూన రవి కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగు నీరు, చెత్త సాగునీటి కాలువల్లోకి రాకుండా చూడాలని, దానికోసం ఒక సొల్యూషన్ ఉందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పైన చర్చించారు. వంశధార కుడి, ఎడమ కాలువల పై చర్చించారు. ఎల్ఎంసి, ఆర్ఎంసిలలో ఉన్న పనులను గుర్తించి అంచనాలు తయారు చేసి సంబంధిత శాసన సభ్యులకు తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. సైడ్ వీవర్, లిఫ్ట్ ఇరిగేషన్, వంశధార ఫేజ్-2 పనులపై అంచనాలు తయారు చేసి సంబంధిత శాసన సభ్యులకు తెలియజేయాలని ఆదేశించారు. పలాస శాసన సభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ ఆఫ్షోర్ రిజర్వాయర్ పై ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేపడుతున్న పనులపై సమీక్షిస్తే పురోగతి తెలిస్తోందన్నారు.
ఆఫ్షోర్ పనులకు సంబంధించి నెలకో పని చొప్పున లక్ష్యం పెట్టుకుంటే ప్రతీ నెల సమీక్ష కోసం అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలు ఉంటే పరిష్కారం చేయవచ్చన్నారు. హైలెవల్ కెనాకు సంబంధించి వివరాలను శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా హైలెవల్ కెనాకు సంబంధించి భూ సేకరణ పూర్తి అయిందని నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. నారాయణపురం ఆనకట్ట కు ఫీల్డ్ ఛానల్స్ వద్ద షట్టర్లు లేవని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పగా షట్టర్లు ఉంటే శివారు భూములకు సాగునీరు వెలుతుందని, షట్టర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం కావాలని మంత్రి ఆదేశించారు. ఫ్లెడ్ బాంక్స్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు కూన రవి కుమార్, పలాస శాసన సభ్యులు గౌతు శిరీష, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ ఎ. రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్టు ఛైర్మన్ సనపల డిల్లీరావు, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, వంశధార డిప్యూటీ కలెక్టర్ జి. జయదేవి, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, ఈఈలు, నీటి సంఘాల ఛైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Omnamashivaya S1
- తిరుపతి జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మర్రిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షతలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశనిర్మాణంలో అటల్ జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియకు తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళా నాయకులు, ప్యానలిస్టులు పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1