అధైర్య పడకండి అండగా ఉంటాం* **భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ: ఆర్థిక సహాయం అందజేత** **ధర్మవరం:** కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి పేర్కొన్నారు స. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మంగళవారం ఇద్దరు మృతుల కుటుంబాలను పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రావులచెరువు గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్పఅనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని నాయకులు పరామర్శించారు. మల్లా కాల్వ గ్రామానికి చెందిన బైక్ ప్రమాదంలో అకాల మరణం చెందిన కురుబ యోగేంద్ర మృతి పట్ల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన టీడీపీ నాయకులు వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు, పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్నిఅందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ వర్ణనాతీతం. అధైర్య పడవద్దు, మీకు మేమున్నామంటూ" నాయకులు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్ ,పురుషోత్తం గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి విజయసారథి,స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధైర్య పడకండి అండగా ఉంటాం* **భాదిత కుటుంబాలకు అండగా టీడీపీ: ఆర్థిక సహాయం అందజేత** **ధర్మవరం:** కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి పేర్కొన్నారు స. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మంగళవారం ఇద్దరు మృతుల కుటుంబాలను పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రావులచెరువు గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్పఅనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని నాయకులు పరామర్శించారు. మల్లా కాల్వ గ్రామానికి చెందిన బైక్ ప్రమాదంలో అకాల మరణం చెందిన కురుబ యోగేంద్ర మృతి పట్ల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన టీడీపీ నాయకులు వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు, పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్నిఅందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ వర్ణనాతీతం. అధైర్య పడవద్దు, మీకు మేమున్నామంటూ" నాయకులు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్ ,పురుషోత్తం గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి విజయసారథి,స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- కదిరి డిపో ఉద్యోగుల సౌజన్యంతో జై జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ అందరి పాలిట దైవంసుడన్నారు. ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందికుంట అన్నదానం చేశారు.1
- కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.1
- కర్నూలు జిల్లా ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు . మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్‌కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్‌కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.1
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- ధర్మవరం... శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావులచెరువు పంచాయితీ ఆర్.ఎర్రగుంటపల్లి లో దళితుల స్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేశారని గ్రామానికి చెందిన దళితులు నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామానికి చెందిన హైమావతి మాట్లాడుతూ తన తల్లి అంజనమ్మ వారం రోజుల క్రితం మృతి చెందితే అంతక్రియలు నిర్వహించామన్నారు. గ్రామానికి చెందిన నారాయణ సమాధులు పెకలించి కబ్జాకు పాల్పడ్డాడని వాపోయింది. అడ్డుకోబోయిన తమపై దాడులకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తమకు రక్షణగా నిలిచి స్మశానానికి స్థలం కేటాయించాలని డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరయ్య కు వినతి పత్రం అందజేశారు.గ్రామానికి వెళ్లి విచారణ చేయాలని వీఆర్వో మధుసూదన్ రెడ్డి సర్వేయర్ ను రెవిన్యూ అధికారులు ఆదేశించడంతో వారు గ్రామానికి వెళ్లి సర్వే చేసి గతంలో కేటాయించిన విధంగా 45 సెంట్లను దళితుల స్మశానానికి ఇవ్వాల్సిందేనని నివేదిక సమర్పించారు.1
- కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది సంప్రదించాల్సిన వ్యక్తి :-93461102391
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1