కడప జిల్లా పొద్దుటూరు పరిధిలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం పొద్దుటూరు పరిధిలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. * ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు * ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారు, మోటారు సైకిల్ సీజ్. ప్రొద్దుటూరు జూలై 30 జనవేళ ప్రతినిధి కడప జిల్లా పొద్దుటూరు పరిధిలో కారులో తరలిస్తున్న 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, పైలట్ గా వ్యవహరించిన మోటారు సైకిల్ లను సీజ్ చేశారు.టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ కడప జిల్లా బసాపురం వద్ద లోడింగ్ పాయింట్లను తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఖాజీపేట సెక్షన్ పత్తూరు అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నాగపట్నం వైపు నుంచి ఒక మోటారు సైకిల్, మరో కారు వేగంగా వస్తూ కనిపించాయి. తనిఖీ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వాహనాలు అపి దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిన సిబ్బంది ముగ్గురును పట్టుకోగలిగారు. కారులో చూడగా 7ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబట్టిన వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారు, మోటారు సైకిల్ తో సహా ముగ్గురు స్మగ్లర్లును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా పొద్దుటూరు పరిధిలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం పొద్దుటూరు పరిధిలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. * ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు * ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారు, మోటారు సైకిల్ సీజ్. ప్రొద్దుటూరు జూలై 30 జనవేళ ప్రతినిధి కడప జిల్లా పొద్దుటూరు పరిధిలో కారులో తరలిస్తున్న 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును, పైలట్ గా వ్యవహరించిన మోటారు సైకిల్ లను సీజ్ చేశారు.టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ కడప జిల్లా బసాపురం వద్ద లోడింగ్ పాయింట్లను తనిఖీ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఖాజీపేట సెక్షన్ పత్తూరు అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నాగపట్నం వైపు నుంచి ఒక మోటారు సైకిల్, మరో కారు వేగంగా వస్తూ కనిపించాయి. తనిఖీ చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వాహనాలు అపి దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిన సిబ్బంది ముగ్గురును పట్టుకోగలిగారు. కారులో చూడగా 7ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబట్టిన వారిని కడప, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారు, మోటారు సైకిల్ తో సహా ముగ్గురు స్మగ్లర్లును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.1