Shuru
Apke Nagar Ki App…
ప్రశాంత జీవితాన్ని అలవర్చుకోవాలి: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్:పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు.మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఆర్‌ఎస్‌ఐ ఆర్.కే. పూర్ణచందర్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి, శాలువాతో సత్కరించారు. పూర్ణచందర్ పోలీసు శాఖకు అందించిన సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలను ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులో ఆయన ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Kasani Venkatesh
ప్రశాంత జీవితాన్ని అలవర్చుకోవాలి: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్:పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు.మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఆర్‌ఎస్‌ఐ ఆర్.కే. పూర్ణచందర్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేసి, శాలువాతో సత్కరించారు. పూర్ణచందర్ పోలీసు శాఖకు అందించిన సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలను ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులో ఆయన ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,....... నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల (BC) బాలికల వసతి గృహాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ సందర్శించారు. విద్యార్థినుల మధ్య కూర్చొని భోజనం చేస్తూ,వారికి అందుతున్న విద్యా, వసతి వివరాలను ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సౌజన్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు1
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.2