logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.

4 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
4 hrs ago

గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఈనెల 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బాబా రాందేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రమణ్యం తీవ్రంగా ఖండించారు. రాందేవ్ బాబా కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఆధునిక వైద్య విధానాన్ని (అలోపతి) కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు గుర్తుచేశారు. డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ 1954ను ఉల్లంఘిస్తూ వివిధ వ్యాధులను పతంజలి మందులతో నయం చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని తెలిపారు. 2023లో సుప్రీంకోర్టు ఈ విషయాలపై విచారించి రాందేవ్ బాబాతో బహిరంగ క్షమాపణలు చెప్పించిందని, పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులతో కోవిడ్ ను సంపూర్ణంగా నయం చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పతంజలి కరోనిల్‌ను ఆమోదించిందని తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ అన్నారు. బిపి, షుగర్, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తామంటూ పత్రికలలో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, కోర్టు తీర్పును అనుసరించి రాందేవ్ బాబా పత్రికలకు ప్రకటనలు ఇచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ప్రతి ఏటా ₹40,000 కోట్ల ఉత్పత్తులను అమ్ముతూ ప్రజల నమ్మకాలను లాభాలుగా మార్చుకుంటున్నారని తెలిపారు. భారతీయ ప్రజలలో ఉన్న సనాతన భావాలను, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభార్జన పొందుతున్నారని ఆయన వివరించారు. సుదీర్ఘ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు నేడు హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే బాబా రాందేవ్ ను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారని సుబ్రమణ్యం ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీని సంతృప్తి పరచడానికే ఈ హిందుత్వ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల, అంతర్జాతీయ యోగా దినోత్సవ వానికి రాందేవ్ బాబాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం తగదని జన చైతన్య వేదిక పునరుద్ఘాటించింది.

More news from Andhra Pradesh and nearby areas
  • గుంటూరులోని ఎస్‌.కే.బీ.ఎం (SKBM) ప్రభుత్వ పాఠశాలలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు మరియు డైనింగ్ హాల్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఢిల్లీ విహారయాత్రకు వెళ్లిన పాఠశాల విద్యార్థులు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన జ్ఞాపకాలను ప్రతిబింబించే ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌ను కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచి, పదవ తరగతిలో అదనపు మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ఎస్‌కేబీఎం పాఠశాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టామని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పీ4 (P4) విధానంలో ఐటీసీ సంస్థ రూ.20 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు మరియు దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
    1
    గుంటూరులోని ఎస్‌.కే.బీ.ఎం (SKBM) ప్రభుత్వ పాఠశాలలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు మరియు డైనింగ్ హాల్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఢిల్లీ విహారయాత్రకు వెళ్లిన పాఠశాల విద్యార్థులు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన జ్ఞాపకాలను ప్రతిబింబించే ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌ను కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఇది ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచి, పదవ తరగతిలో అదనపు మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ఎస్‌కేబీఎం పాఠశాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టామని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పీ4 (P4) విధానంలో ఐటీసీ సంస్థ రూ.20 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు మరియు దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    18 hrs ago
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేక అర్చన కైంకర్యాలు నిర్వహించారు. జిల్లా యాదవ సాధికార సంఘ అధ్యక్షులు శ్రీ శ్రీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, శ్రీధర్ యాదవ్ గారు నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    1
    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేక అర్చన కైంకర్యాలు నిర్వహించారు. జిల్లా యాదవ సాధికార సంఘ అధ్యక్షులు శ్రీ శ్రీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, శ్రీధర్ యాదవ్ గారు నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా, జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం పరిసరాలు, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుపు మొక్కలను పీకేయడం, పొదలను కత్తిరించడం, వాకింగ్ ట్రాక్‌ను శుభ్రపరచడం, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించడం, పార్కులోని మొక్కల సంరక్షణ వంటి పనులు చేపట్టారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఈ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పట్టణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 ఈ-ఆటోలు, 20 పుష్ కార్టులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు ప్రతి వార్డులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, దువ్వల రామకృష్ణ, నూకల బాలకృష్ణ, కోటగిరి సుధాకర్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, MEPMA స్వయం సహాయక సంఘాల మహిళలు, MEPMA సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ప్రజలందరూ పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుని జగ్గయ్యపేటను రాష్ట్రంలోనే ఆదర్శ పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
    4
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా, జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం పరిసరాలు, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుపు మొక్కలను పీకేయడం, పొదలను కత్తిరించడం, వాకింగ్ ట్రాక్‌ను శుభ్రపరచడం, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించడం, పార్కులోని మొక్కల సంరక్షణ వంటి పనులు చేపట్టారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఈ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పట్టణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 ఈ-ఆటోలు, 20 పుష్ కార్టులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు ప్రతి వార్డులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, దువ్వల రామకృష్ణ, నూకల బాలకృష్ణ, కోటగిరి సుధాకర్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, MEPMA స్వయం సహాయక సంఘాల మహిళలు, MEPMA సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ప్రజలందరూ పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుని జగ్గయ్యపేటను రాష్ట్రంలోనే ఆదర్శ పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉషారాణి బెల్ట్ షాపుల నియంత్రణకు ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నారు, ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ఆమె చేపట్టిన ఈ కొత్త విధానంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు పాన్ షాపులు, కిరాణా షాపులతో సహా ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ మద్యం విక్రయాల వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చింత్రియాల గ్రామ పంచాయతీలోని కట్టంవారిగూడెంలో బెల్ట్ షాపులను నియంత్రించాలని సర్పంచ్ ఉషారాణి నిర్ణయించారు. గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులతో చర్చించిన అనంతరం, కేవలం ఒకే బెల్ట్ షాప్‌ను మాత్రమే నిర్వహించేలా తీర్మానం చేశారు. ఈ బెల్ట్ షాప్ కోసం వేలం పాట నిర్వహించి, అధిక మొత్తం చెల్లించిన వ్యక్తికి ఏడాది పాటు మద్యం విక్రయాల బాధ్యతను అప్పగించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు సర్పంచ్ ఉషారాణి తెలిపారు. ఈ విధానం కొంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, గ్రామాలలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉషారాణి బెల్ట్ షాపుల నియంత్రణకు ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నారు, ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ఆమె చేపట్టిన ఈ కొత్త విధానంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పల్లెటూర్ల నుండి పట్టణాల వరకు పాన్ షాపులు, కిరాణా షాపులతో సహా ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ మద్యం విక్రయాల వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చింత్రియాల గ్రామ పంచాయతీలోని కట్టంవారిగూడెంలో బెల్ట్ షాపులను నియంత్రించాలని సర్పంచ్ ఉషారాణి నిర్ణయించారు. గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులతో చర్చించిన అనంతరం, కేవలం ఒకే బెల్ట్ షాప్‌ను మాత్రమే నిర్వహించేలా తీర్మానం చేశారు.

ఈ బెల్ట్ షాప్ కోసం వేలం పాట నిర్వహించి, అధిక మొత్తం చెల్లించిన వ్యక్తికి ఏడాది పాటు మద్యం విక్రయాల బాధ్యతను అప్పగించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నట్లు సర్పంచ్ ఉషారాణి తెలిపారు. ఈ విధానం కొంత వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, గ్రామాలలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20-06-2026 శనివారం నాడు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూవివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే రాగమయి గారు మాట్లాడుతూ, బుగ్గపాడు ఫుడ్ పార్క్ విషయంలో కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, గ్రామస్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే దీనిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒకప్పుడు మూతపడిపోయిన ఈ ప్రతిష్టాత్మక ఫుడ్ పార్కును తమ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బుగ్గపాడులో రూ. 660 కోట్ల ప్రాజెక్టుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకొచ్చిందని, పది సంవత్సరాల నుండి పాడుబడి ఉన్న ఈ ఫుడ్ పార్కును అభివృద్ధి పథంలో నడుపుతున్నామని వివరించారు. 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 61.13 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ జరిగిందని, రూ. 109 కోట్లతో ఇప్పటివరకు ఫుడ్ పార్కును అభివృద్ధి చేశామని వెల్లడించారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసి అక్కడివారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక దృష్టి సారించి ఫుడ్ పార్కును పునఃప్రారంభించాలని కోరామని, గిరిజన ప్రాంతాల్లో భూధర ఎక్కువగా ఉంటే కంపెనీలు రావని పెద్దలను కోరినట్లు తెలిపారు. దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ రూ. 650 కోట్ల ప్రాజెక్టుతో 3000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వచ్చిందని, ఇతర ప్రాంతాల్లో భూములు చూసినప్పటికీ, బుగ్గపాడులోనే బాగుంటుందని నిర్ణయించి, అందరి ఆమోదంతో భూములు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి చెడు కోణం లేదని, ప్రాంత ప్రజలకు మంచి జరుగుతోందన్నదే తమ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే రాగమయి గారు నొక్కి చెప్పారు. గత కొద్ది రోజులుగా రకరకాల పార్టీల వారు వచ్చి ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తే చూసి ఊర్వలేరా అని ప్రశ్నిస్తూ, ప్రతిపక్ష పార్టీలు రంధ్రాన్వేషణ చేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని హితవు పలికారు.
    3
    ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20-06-2026 శనివారం నాడు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూవివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే రాగమయి గారు మాట్లాడుతూ, బుగ్గపాడు ఫుడ్ పార్క్ విషయంలో కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, గ్రామస్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే దీనిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒకప్పుడు మూతపడిపోయిన ఈ ప్రతిష్టాత్మక ఫుడ్ పార్కును తమ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

బుగ్గపాడులో రూ. 660 కోట్ల ప్రాజెక్టుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకొచ్చిందని, పది సంవత్సరాల నుండి పాడుబడి ఉన్న ఈ ఫుడ్ పార్కును అభివృద్ధి పథంలో నడుపుతున్నామని వివరించారు. 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 61.13 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ జరిగిందని, రూ. 109 కోట్లతో ఇప్పటివరకు ఫుడ్ పార్కును అభివృద్ధి చేశామని వెల్లడించారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసి అక్కడివారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక దృష్టి సారించి ఫుడ్ పార్కును పునఃప్రారంభించాలని కోరామని, గిరిజన ప్రాంతాల్లో భూధర ఎక్కువగా ఉంటే కంపెనీలు రావని పెద్దలను కోరినట్లు తెలిపారు. దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ రూ. 650 కోట్ల ప్రాజెక్టుతో 3000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వచ్చిందని, ఇతర ప్రాంతాల్లో భూములు చూసినప్పటికీ, బుగ్గపాడులోనే బాగుంటుందని నిర్ణయించి, అందరి ఆమోదంతో భూములు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి చెడు కోణం లేదని, ప్రాంత ప్రజలకు మంచి జరుగుతోందన్నదే తమ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే రాగమయి గారు నొక్కి చెప్పారు. గత కొద్ది రోజులుగా రకరకాల పార్టీల వారు వచ్చి ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తే చూసి ఊర్వలేరా అని ప్రశ్నిస్తూ, ప్రతిపక్ష పార్టీలు రంధ్రాన్వేషణ చేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని హితవు పలికారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల క్రాస్ రోడ్డు ప్రాంతంలో యూరియా కేంద్రాల వద్ద రైతులు తీవ్ర కష్టాలను, అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాలపై అదనపు ధరలు వసూలు చేస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల క్రాస్ రోడ్డు ప్రాంతంలో యూరియా కేంద్రాల వద్ద రైతులు తీవ్ర కష్టాలను, అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా బస్తాలపై అదనపు ధరలు వసూలు చేస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    1
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియా ప్రతినిధులతో 'యోగాంధ్ర' కార్యక్రమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలనేదే తమ లక్ష్యమని, దీనిని ఒక మిషన్ మోడ్‌లో అందరికీ చేరువ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారత్ అందించిన అమూల్యమైన బహుమతి అని, దీని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రత సాధించవచ్చని ఆయన అన్నారు. కేవలం సాంకేతికత మాత్రమే సంపదను తీసుకురాదని, భారతదేశానికి ఆధ్యాత్మికత, సంస్కృతి అత్యంత అమూల్యమైన శక్తి అని, యువత ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సైబరాబాద్ నిర్మాణానంతరం అమరావతి రాజధాని నిర్మాణ అవకాశం భగవంతుడు తనకు ప్రసాదించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్‌కు అదనంగా, ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన, ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి, ఈ నగరాన్ని ఒక అధునాతన రాజధానిగా, నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    15 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' (SASA) కార్యక్రమంలో భాగంగా, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బుద్ధ విగ్రహం, బుద్ధ పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుపు మొక్కలను పీకేయడం, పొదలను కత్తిరించడం, వాకింగ్ ట్రాక్‌ను శుభ్రం చేయడం, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించడం, పార్కులోని మొక్కలను సంరక్షించడం వంటి పనులను చేపట్టారు. ప్రజలు నిత్యం ఉపయోగించే ఈ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పట్టణ అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఆయన నొక్కి చెప్పారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని, ఇంటింటికీ చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 ఈ-ఆటోలు మరియు 20 పుష్ కార్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు మాట్లాడుతూ, ప్రతి వార్డులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, దువ్వల రామకృష్ణ, నూకల బాలకృష్ణ, కోటగిరి సుధాకర్, MEPMA స్వయం సహాయక సంఘాల మహిళలు, MEPMA సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ ప్రజలందరూ పరిశుభ్రతను తమ జీవన విధానంలో భాగం చేసుకుని, జగ్గయ్యపేటను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.
    4
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' (SASA) కార్యక్రమంలో భాగంగా, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత పనుల్లో చురుకుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, బుద్ధ విగ్రహం, బుద్ధ పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుపు మొక్కలను పీకేయడం, పొదలను కత్తిరించడం, వాకింగ్ ట్రాక్‌ను శుభ్రం చేయడం, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించడం, పార్కులోని మొక్కలను సంరక్షించడం వంటి పనులను చేపట్టారు. ప్రజలు నిత్యం ఉపయోగించే ఈ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పట్టణ అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని ఆయన నొక్కి చెప్పారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని, ఇంటింటికీ చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 ఈ-ఆటోలు మరియు 20 పుష్ కార్టులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు మాట్లాడుతూ, ప్రతి వార్డులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, దువ్వల రామకృష్ణ, నూకల బాలకృష్ణ, కోటగిరి సుధాకర్, MEPMA స్వయం సహాయక సంఘాల మహిళలు, MEPMA సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం, ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ ప్రజలందరూ పరిశుభ్రతను తమ జీవన విధానంలో భాగం చేసుకుని, జగ్గయ్యపేటను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    1
    ఇబ్రహీంపట్నంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. తాను మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పగా, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నన్నే ఆపుతావా, నేను ఎమ్మెల్యే తాలూకా, పలానా తమ్ముడిని' అంటూ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాకుండా, తాను ఒక రిపోర్టర్‌నని పేర్కొంటూ పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 'మీ అంతు చూస్తాం' అంటూ పోలీసులను, ముఖ్యంగా ఒక మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించి, వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
    user_జేమ్స్
    జేమ్స్
    Vijayawada East, Ntr•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.