క్షణిక ఆవేశానికి వెళ్ళకండి.. జీవితాలు బుగ్గిపాలు చేసుకోమాకండి జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు సత్తుపల్లి క్షణిక ఆవేశానికి పోయి, జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు అన్నారు. శనివారం పట్టణంలోని సబ్ జైల్ నందు మండల లీగల సర్వీస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును సబ్ జైల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్ జైలును పరిశీలించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షణిక ఆవేశంతో తప్పులు చేసి జైలుకు రావద్దని, మంచి ఆలోచనతో నేరం చేయకుండా ఉండాలని, సమాజంలో మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలని, బాధ్యతగా జీవించాలని,చట్టాలపై వివరించారు. ప్రతి ఒక్కరు సత్ప్రవర్తన కలిగి చట్టాలను తెలుసుకుంటే,నేరాలను అదుపులో ఉంచుకోవచ్చు అని వివరించారు. ఖైదీలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే న్యాయ సహాయం కోసం సహకరిస్తామని, లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే మీరా ఖాసిం సాహెబ్ మాట్లాడుతూ, నేరాలు చేసి జైలు పాలు కావడం వలన కుటుంబ సభ్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని, ప్రతి ఒక్క విషయంపై అవగాహన కలిగి ఉంటే తప్పు చేయరని క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిర్ కౌన్సిల్ మారేశ్వరరావు, జె.వి నరేంద్ర ,వెంకట్రావు, సబ్ జైల్ సూపర్డెంట్ కుటుంబరావు, కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది, ఖైదీలు ఉన్నారు.

- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*1
- *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*1