Shuru
Apke Nagar Ki App…
పాపన్నపేట్ : బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొంత మంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మదారి లింగం, జుకంటి బాబు, జిలకర సాయిలు, వడ్డే సాయిలు, బుచ్చం రాజు, షేక్ రఫీ, గోవింద్ ఆంజనేయులు, తాడేపు సంతోష్, బోడ వినోద్, కొమ్ముల అనిల్ ఉన్నారు. వారి వద్ద నుంచి 20,040 నగదు, 10 మొబైల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
MERCY
పాపన్నపేట్ : బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా, కొంత మంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మదారి లింగం, జుకంటి బాబు, జిలకర సాయిలు, వడ్డే సాయిలు, బుచ్చం రాజు, షేక్ రఫీ, గోవింద్ ఆంజనేయులు, తాడేపు సంతోష్, బోడ వినోద్, కొమ్ముల అనిల్ ఉన్నారు. వారి వద్ద నుంచి 20,040 నగదు, 10 మొబైల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1
- Post by Congress social media work1
- Post by Vishwamber Rao1
- Post by Shyam sunder Yadav Pulapally1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.1
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది: 16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, జరుగుతున్న పనుల నాణ్యతను అంచనా వేసి, ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు అందించారు. అలాగే అక్కడ నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించి, విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు. ఈ ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. జిల్లాలో యువతకు క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని రకాల క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్‌డీవో ఎన్.వై. గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, కాంట్రాక్టర్ ఏజెన్సీ సభ్యుడు వెంకటరమణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1