Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాకు చెందిన చింతూరు మండలంలో మానవతా స్పూర్తిని చాటిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షుడు జవహర్ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన యూనియన్ సభ్యులు వెంటనే స్పందించారు. జవహర్ గారి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో యూనియన్ సభ్యులందరూ కలిసి మొత్తం రూ.25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) సేకరించి అందజేశారు. తమ అధ్యక్షుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటం తమ బాధ్యత అని తెలిపారు. అవసరమైతే ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. స్థానిక ప్రజలు యూనియన్ సభ్యుల ఈ సహృదయ చర్యను ప్రశంసిస్తూ, సమాజంలో ఐక్యతకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Sode Prasad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాకు చెందిన చింతూరు మండలంలో మానవతా స్పూర్తిని చాటిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షుడు జవహర్ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన యూనియన్ సభ్యులు వెంటనే స్పందించారు. జవహర్ గారి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో యూనియన్ సభ్యులందరూ కలిసి మొత్తం రూ.25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) సేకరించి అందజేశారు. తమ అధ్యక్షుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటం తమ బాధ్యత అని తెలిపారు. అవసరమైతే ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. స్థానిక ప్రజలు యూనియన్ సభ్యుల ఈ సహృదయ చర్యను ప్రశంసిస్తూ, సమాజంలో ఐక్యతకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
More news from తెలంగాణ and nearby areas
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- Post by Ramprasad islavath1
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1