మధ్యాహ్న భోజనం నిర్వహణ ,నాణ్యతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు అచ్చంపేట, మార్చి 09 (షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం మార్గదర్శకాల ప్రకారం సోమవారం మెనూలో కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ వడ్డించాల్సి ఉండగా, పాఠశాలలో మాత్రం విద్యార్థులకు వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే అందిస్తున్నట్లు కలెక్టర్ గమనించారు. నిర్ణయించిన కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించడం లేదని పాఠశాల సిబ్బందిని అయన ప్రశ్నించారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా బాగా లేకపోవడం గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాంబార్ పసుపు నీళ్లలా ఉందని పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిల్లలకు ప్రతిరోజూ ఇలాగే భోజనం పెడుతున్నారా? అన్నం నాణ్యత ఎలా ఉందో కూడా తెలియదా?” అంటూ ఉపాధ్యాయులను మందలించారు. జిల్లాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించినప్పటికీ ఇంత నాసిరకం భోజనం ఎక్కడా చూడలేదని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి మరియు ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సూచనలు అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తుచేశారు. ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు ధైర్యంగా హాజరై మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని సూచించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో శాతం వంద ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల నుండి 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వివరించారు. ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం నిర్వహణ ,నాణ్యతపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు అచ్చంపేట, మార్చి 09 (షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం మార్గదర్శకాల ప్రకారం సోమవారం మెనూలో కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ వడ్డించాల్సి ఉండగా, పాఠశాలలో మాత్రం విద్యార్థులకు వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే అందిస్తున్నట్లు కలెక్టర్ గమనించారు. నిర్ణయించిన కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించడం లేదని పాఠశాల సిబ్బందిని అయన ప్రశ్నించారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా బాగా లేకపోవడం గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాంబార్ పసుపు నీళ్లలా ఉందని పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిల్లలకు ప్రతిరోజూ ఇలాగే భోజనం పెడుతున్నారా? అన్నం నాణ్యత ఎలా ఉందో కూడా తెలియదా?” అంటూ ఉపాధ్యాయులను మందలించారు. జిల్లాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించినప్పటికీ ఇంత నాసిరకం భోజనం ఎక్కడా చూడలేదని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం
ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి మరియు ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సూచనలు అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని గుర్తుచేశారు. ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు ధైర్యంగా హాజరై మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని సూచించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో శాతం వంద ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల నుండి 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వివరించారు. ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్‌కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి*_1