ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
- రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో వెలసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అనేక భక్తుల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తిని రథోత్సవం పై కొలువుదిర్చి రథోత్సవాన్ని లాగారు. గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.1
- *కడప జిల్లా :* వీరబల్లి మండలంలో ఉద్రిక్తత... సంగంవాండ్లపల్లి వద్ద వీరబల్లి-రాయచోటి రహదారి పై బైఠాయించిన సంగంవాండ్లపల్లి, పెద్దివీడు గ్రామాల ప్రజలు... నిలిచిపోయిన రాకపోకలు... ఆక్రమణకు గురైన తిమ్మారెడ్డి చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ నినాదాలు... కబ్జాదారులకు వీరబల్లి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణ...1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- Post by T. Raja simha1
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2