ఘనంగా జరిగిన మిలా దున్ నబీ వేడుకలు.. ..,...................... ధర్మవరం:: పట్టణంలోని హజరత్ మహమ్మద్ షా ఖాద్రి దర్గా వద్ద మిలాదున్ నబీ వేడుకలు అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో, ముస్లిమ్స్ నడుమ ఘనంగా నిర్వహించుకున్నరు. ఈ సందర్భంగా తొలుత ముస్లిం పెద్దలతో పాటు టూ టౌన్ సిఐ జయ నాయక్, ఎస్సై వీరేష్ దర్గాలో ప్రత్యేక పూజలు, నమాజు చేశారు. అనంతరం కమిటీ వారు సిఐ జయ నాయక్ ను ఘనంగా సన్మానించారు. తదుపరి ప్రత్యేకంగా అలంకరించిన మిలా దున్ నబి (గోపుర ప్రతిమ) శాంతి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి ఈ ర్యాలీ లో వందలాదిమంది ముస్లిం సోదరులు వేడుకల ప్రాధాన్యతను తెలుపుతూ పట్టణములో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. తదుపరి మత పెద్దలు ఈ పండుగ ప్రాధాన్యతను, విశిష్టతను తెలియజేశారు. తదుపరి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. తదుపరి దర్గాలో దాదాపు 3,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దర్గా కమిటీ, మిలాద్ దులుష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు దువాలు నిర్వహించామని తెలిపారు. తదుపరి ప్రవక్త బోధనలు తెలపడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు కురాన్ కూడా చదువుకోవడం జరిగిందన్నారు. వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రవక్త మానవతా సందేశాన్ని ఆచరణలో పెట్టాలని తెలిపారు. ఈ వేడుకలకు డిఎస్పి ఆదేశాల మేరకు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మెహబూబ్ షాప్, ముక్తార అహ్మద్, కొత్వాల్ కాజా హుస్సేన్, మహమ్మద్ ఖాద్రి, ఇలియాజ్, నజీర్ అహ్మద్, మహబూబ్ బాషా, మసూద్, సయ్యద్, ముజువర్ ఖాదర్ వలీ, నూర్, షహన్షా, తాహిద్ లతో పాటు వందలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన మిలా దున్ నబీ వేడుకలు.. ..,...................... ధర్మవరం:: పట్టణంలోని హజరత్ మహమ్మద్ షా ఖాద్రి దర్గా వద్ద మిలాదున్ నబీ వేడుకలు అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో, ముస్లిమ్స్ నడుమ ఘనంగా నిర్వహించుకున్నరు. ఈ సందర్భంగా తొలుత ముస్లిం పెద్దలతో పాటు టూ టౌన్ సిఐ జయ నాయక్, ఎస్సై వీరేష్ దర్గాలో ప్రత్యేక పూజలు, నమాజు చేశారు. అనంతరం కమిటీ వారు సిఐ జయ నాయక్ ను ఘనంగా సన్మానించారు. తదుపరి ప్రత్యేకంగా అలంకరించిన మిలా దున్ నబి (గోపుర ప్రతిమ) శాంతి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి ఈ ర్యాలీ లో వందలాదిమంది ముస్లిం సోదరులు వేడుకల ప్రాధాన్యతను తెలుపుతూ పట్టణములో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. తదుపరి మత పెద్దలు ఈ పండుగ ప్రాధాన్యతను, విశిష్టతను తెలియజేశారు. తదుపరి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. తదుపరి దర్గాలో దాదాపు 3,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం
దర్గా కమిటీ, మిలాద్ దులుష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు దువాలు నిర్వహించామని తెలిపారు. తదుపరి ప్రవక్త బోధనలు తెలపడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు కురాన్ కూడా చదువుకోవడం జరిగిందన్నారు. వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రవక్త మానవతా సందేశాన్ని ఆచరణలో పెట్టాలని తెలిపారు. ఈ వేడుకలకు డిఎస్పి ఆదేశాల మేరకు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మెహబూబ్ షాప్, ముక్తార అహ్మద్, కొత్వాల్ కాజా హుస్సేన్, మహమ్మద్ ఖాద్రి, ఇలియాజ్, నజీర్ అహ్మద్, మహబూబ్ బాషా, మసూద్, సయ్యద్, ముజువర్ ఖాదర్ వలీ, నూర్, షహన్షా, తాహిద్ లతో పాటు వందలాదిమంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.1
- రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.1