Shuru
Apke Nagar Ki App…
పెద్దకొత్తపల్లి : రైతులకు గరిష్ట ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో రైతులకు సాగు స్వేచ్ఛతో పాటు గరిష్ట ధర లభిస్తుందని మార్కెట్ చైర్మన్ దండు నరసింహ అన్నారు. పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న మార్కెట్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న సాగుపై గతంలో ఉన్న భయాలను తొలగించి, రైతులను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రతాప్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వి.సత్యం, సర్పంచ్ మొట్టే కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
MALLIKARJUN T
పెద్దకొత్తపల్లి : రైతులకు గరిష్ట ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో రైతులకు సాగు స్వేచ్ఛతో పాటు గరిష్ట ధర లభిస్తుందని మార్కెట్ చైర్మన్ దండు నరసింహ అన్నారు. పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న మార్కెట్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న సాగుపై గతంలో ఉన్న భయాలను తొలగించి, రైతులను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రతాప్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వి.సత్యం, సర్పంచ్ మొట్టే కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా – గ్రామస్తుల ఆనందం1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన బీకాం రెండో సంవత్సరం విద్యార్థి సూరజ్ (22) మృతదేహాన్ని డీఆర్ఎఫ్ బృందం వెలికితీసింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్, తన నలుగురు స్నేహితులతో కలిసి క్వారీలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- ప్రాజెక్టులు పూర్తి అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం1
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4